వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడకుండా ఉంటే వంద కోట్లు విరాళంగా ఇస్తానని మెగా కృష్ణారెడ్డి తనకు ఆఫర్ ఇస్తే తిరస్కరించినట్టు ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మీడియాకు లీక్ ఇచ్చారు. ఈ విషయం తెలిసి ఆ పార్టీ నాయకులు మెగాపై మరింత మండిపడుతున్నారు. తమ పార్టీని మరీ ఇంత తక్కువకు ఖరీదు కట్టడం ఏమిటి? ఇది ఒక రకంగా తమకు అవమానమేనని ఆ పార్టీ నాయకుడు ఒకరు వాపోయారు. ఇందులో అవమానం ఏముందని అడిగితే.. అవతల ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే వంద కోట్ల రేటు పలుకుతుంటే, మా పార్టీ మొత్తాన్ని ఒక ఎమ్మెల్యేతో సమానం చేసి లెక్కకట్టడం ఏమిటని అన్నారు. ఇప్పటికే తమ పార్టీ వైఎస్ఆర్ టీపీని వైఎస్ఆర్ కేపీ (కాళేశ్వరం పార్టీ) అంటూ జనం ఎద్దేవా చేస్తుండగా, మరీ చౌకగా వంద కోట్లకు లెక్కకట్టడం అవమానకరమే కదా అని సదరు నాయకుడు వాపోయారు.