చాయ్ అమ్మిన వ్యక్తి..దేశ ప్రధానిగా ఎదిగారంటే అందరూ సంతోషించారు. అది భారతదేశ ప్రజల విశ్వాసం, గొప్పతనంగా అందరూ భావించారు. ఆయన అనేక మందికి ఆదర్శమంటూ చప్పట్లు చరిచి..పొగడ్తలతో ఆయన ఎదిగిన తీరును అభినందించారు. కానీ ఆ చాయ్ వాలా పక్కా జూటావాలా అని తెలుసుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు. అర్ధరాత్రి నిర్ణయాలు, ఏకపక్ష పోకడలతో భారతదేశ సబ్బండ వర్గాలను ఆయన తన మాటలతో మోసం చేశారు. అది కండ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్నది. 2014 ఎన్నికలకు ముందు దేశాన్ని అవినీతి రహిత భారత్‌గా తీర్చిదిద్దుతానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తిరిగి రెండోసారి అధికారంలోకి వచ్చి ఇప్పటికి 8 ఏండ్లు గడుస్తున్నది. అయినప్పటికీ ఆయన చెప్పిన మాటలన్నీ అబద్ధపు మూటలు గానే మిగిలిపోయాయి.
దేశంలోనే అత్యంత ప్రయోజనకరంగా, లాభాలాతో నడుస్తున్న ఎల్ఐసీని ఇప్పటికే సగం ప్రైవేటు శక్తులకు అప్పగించారు. రైల్వే, టెలికాం (బీఎస్ఎన్ఎల్) లను సైతం ప్రైవేటు శక్తులకు అప్పగిస్తున్నారు. ఇలా దేశంలోఒక్కో రంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది.
ఇట్ల ఒక్కటని కాదు మోదీ ఇచ్చిన అనేక హామీలు అమలుకు నోచుకోలేదు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని హామీ ఇచ్చి ఏడున్నర ఏండ్లు గడుస్తున్నా నేటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇటీవల సుప్రీం కోర్టు సైతం రిజర్వేషన్ల పంపిణీ వ్యవస్థ రాష్ర్టాల చేతిలో ఉండేలా చూడాలని తీర్పునిచ్చింది. కానీ పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని లేవనెత్తిన ప్రతిసారి దాన్ని మరుగున పడేసే ప్రయత్నం చేస్తున్నది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏటా రెండు కోట్ల కేంద్ర కొలువులను భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయింది. అంతేకాదు యువతను అవమానించేలా స్వయంగా దేశ ప్రధాని మోదీ అందరికీ ఉద్యోగాలు సాధ్యం కావు.. పకోడీ దుకాణాలు పెట్టుకోవాలంటూ ఉచిత సలహాలు ఇచ్చిన సంగతి దేశ ప్రజలు మరువలేదు.
దేశంలో నల్ల డబ్బును వెలికి తీసి పేదల ఖాతా ల్లో ఒక్కొక్కరికీ 15 లక్షలు జమ చేస్తామని చెబితే అణగారిన, బడుగు, బలహీన వర్గాలు తెగ సంబురపడ్డాయి. అందు కోసం నోట్లు రద్దు చేయాలని రాత్రికి రాత్రే నిర్ణయిస్తే బ్యాంకుల ముందు బారులుగా నిలబడి నేలరాలిన వారున్నారు. నోట్లు రైద్దెతే చేశారు కానీ, నల్ల డబ్బు, అవినీతి ధనం లెక్క మాత్రం ఇంకా తేలడం లేదు.
కరోనా పంజా విసిరి ప్రాణాలు తీస్తుంటే రాత్రికి రాత్రే ఎక్కడికక్కడ లాక్ డౌన్ అంటే… ఎంతో మంది వలస కార్మికులు బిక్షగాళ్లుగా మారిన సంగతి తెలిసిందే. నెత్తిన మూటలు, సంకలో సంటిబిడ్డలతో కిలోమీటర్ల మేర కాళ్లను చక్రాలుగా మలుచుకొని సొంత రాష్ర్టాలకు పయనమైన వేళ ఆగిన గుండెలు ఎన్నో. కరోనా వల్ల దేశవ్యాప్తంగా అనేక మంది ఉద్యోగాలు కోల్పోయి మానసిక వేదనతో ఆగమైన కుటుంబాలకు లెక్కేలేదు. వారందరికీ ఉద్యోగాలు కల్పించిన సంగతి దేవుడెరుగు… ఒక్కో ప్రభుత్వ రంగ సంస్థను కార్పొరేట్ శక్తులకు, బడా పెట్టుబడిదారులకు అప ్పగిస్తూ వారికి రెడ్ కార్పెట్ పరిచారు.
దేశంలోనే అత్యంత ప్రయోజనకరంగా, లాభాలాతో నడుస్తున్న ఎల్ఐసీని ఇప్పటికే సగం ప్రైవేటు శక్తులకు అప్పగించారు. రైల్వే, టెలికాం (బీఎస్ఎన్ఎల్) లను సైతం ప్రైవేటు శక్తులకు అప్పగిస్తున్నారు. ఇలా దేశంలో ఒక్కో రంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. భూ మాతనే నమ్ముకొని… బురదలో నుంచి బువ్వను తీసే రైతన్నలను ఏడాదిపాటు మానసిక వేదనకు గురి చేశారు. మూడు నల్ల చట్టాలను తీసుకు వచ్చి వారిని ఇబ్బందులకు గురిచేసి ఆ తర్వాత చట్టాలను రద్దు చేసుకున్నారు. తెలంగాణ వరిపై ఆంక్షలు విధిస్తూ రాష్ర్టానికో తీరును కేంద్రం అమలు చేస్తూ… వారికి అనుకూలమైన వారికి మాత్రమే చేయూతనిస్తున్నది. వరి కొనుగోలు విషయంలో తెలంగాణ రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందుల పాలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్నా చేస్తే కేంద్రం దిగిరాక తప్పలేదు.
పార్లమెంటులో ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ కేంద్రం దళితుల అభివృద్ధికి నామమాత్రపు నిధులను కేటాయించింది. దేశంలో దాదాపు 30 శాతానికిపైగా ఉన్న దళితులకు కేటాయించిన బడ్జెట్ రూ.12,800 కోట్లు మాత్రమే. గుజరాత్, ఉత్తరప్రదేశ్ లాంటి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి.
అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనాలోనూ…వలస కార్మికులను ఆదుకున్నది. ఏడేండ్ల పాలనలో దళిత, బడుగు, బలహీన వర్గాలకు అవసరమైన అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. అటువంటి గుణాత్మకమైన పాలనతో ముందుకెళ్తున్న తెలంగాణ రాష్ట్ర సర్కారు పథకాలను అనేక రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకొని ఆయా రాష్ర్టాల్లో అమలు చేస్తున్నాయి. ఒకప్పుడు ఎడారిగా, బీడు వారి ఉన్న తెలంగాణ భూములు నేడు కాళేశ్వర జలాలతో ఎటు చూసినా పచ్చని తోరణాలతో స్వాగతం పలుకుతున్నాయి.
తెలంగాణ సర్కారు పథకాలు నచ్చి, ఉద్యమ రథసారథి కేసీఆర్ సారథ్యంలో అనేక రాష్ర్టాల ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు కేసీఆర్‌తో జత కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే అనేక బడా పరిశ్రమలకు హైదరాబాద్ వేదికగా మారింది. ఇవన్నీ జీర్ణించుకోలేని మోదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై అక్కసును వెళ్లగక్కుతూ విషం చిమ్మే మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేస్తూ… ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం. కేవలం ఎన్నికల్లో లబ్ధికోస మే విద్వేషాలను పెంచిపోషిస్తున్న ది. బీజేపీని గద్దె దించితే తప్ప మన దేశానికి మంచి రోజులు రావన్నది నిజం. అందుకోసం తెలంగాణ యువత, రైతాంగం, సబ్బం డ వర్గాలు ఉద్యమ రథసారథి కేసీఆర్ అడుగుజాడల్లో భవిష్యత్తు బంగారు భారత్కోసం నడవాల్సిన అవసరం ఉన్నది.
(వ్యాసకర్త: దళిత విద్యార్థి
ఉద్యమ నాయకుడు)
సంపత్ గడ్డం
78933 03516