కుట్రలు, కుతంత్రాలే రణతంత్రం
కేసులు నిర్బంధాలే రాజమంత్రం
గుత్తాధిపత్యమే పాలనా సూత్రం
ఇది నేటి దేశరాజకీయాల ముఖచిత్రం!
రాజ్యాంగాన్ని మసకబార్చడం
ప్రజాస్వామ్యాన్ని పరిహసించడం
శాసన వ్యవస్థల్ని గుప్పిట పట్టడం
ఇదీ రాజ్యపాలకుల నయా నైజం!
ఇపుడు ఢిల్లీ మోదీ-షా ద్వయం
తమకు వంతపాడని ప్రభుత్వాల్ని
నిలువునా కూల్చడమే లక్ష్యం
ఆపరేషన్ లోటస్ అస్త్రం..!
పరపార్టీ నేతలకు
డబ్బు మూటల పంపిణీలు
మంత్రి పదవుల పందేరాలు
భారీ నజరానాల అర్పణలు!
తమ దారికి వస్తే సరి!
లేదంటే.. ఆధీన సంస్థల మూకదాడులు
అక్రమ కేసులు అనర్హత వేట్లతో
రాష్ర్టాలను చెరబట్టడం..!
ఓయ్.. కేంద్రపాలక ద్వయమా
రాజ్య విస్తరణ కాంక్ష నెత్తికెక్కి
ఇష్టారాజ్యంగా పెట్రేగుట తగదు
ప్రజా సర్కార్ల కూల్చుట వలదు!
ఇకనైనా ఆధిపత్య చేష్టలు
చీకటి కుయుక్తులు చాలించి
న్యాయవర్తన నడిస్తే సరి!
కాదు కూడదని మొండికేస్తే…
ప్రజల చేతిలో శిక్ష తప్పదు
చరిత్ర చెప్పే నగ్నసత్యమిది!
-కోడిగూటి తిరుపతి, 9573929493