బాబు.. బాబు మీకు దండం పెడుతా. ఆ నినాదం మాత్రం చేయకండి. నిజంగా నా మీద అభిమానం ఉంటే మరేదైనా అనండి అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీటింగ్కు వెళ్లినచోట ముందుగానే కార్యకర్తలను వేడుకుంటున్నారట. కాబోయే సీఎం ఈటల రాజేందర్ అని ఆయన తన మనుషులతో నినాదాలు కొట్టించుకుంటున్నాడని బీజేపీ రాష్ట్ర నాయకులు అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేయడం, ఆయన సంజాయిషీ ఇచ్చుకోవడం ఇప్పటికే జరిగిందట. కానీ ఈ విషయాలేవీ తెలియని కొందరు అభిమానులు ఈటల రాజేందర్ కాబోయే సీఎం అంటూ నినాదాలు చేయడంతో నిజంగా నా మీద అభిమానం ఉంటే మరేదైనా అనండి కానీ ఈ నినాదం మాత్రం వద్దే వద్దని వేడుకుంటున్నట్టు సమాచారం. హైదరాబాద్ నగర మాజీ మేయర్ కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి కార్యక్రమానికి ఈటల రాజేందర్ రాగానే కాబోయే సీఎం ఈటల అంటూ నినాదాలు చేశారట. దీంతో ఆ నినాదాలు చేస్తున్న వారి దగ్గరికి వెళ్లి నా మీద అభిమానం ఉంటే మరేదైనా అనండి. అంతేకానీ దయచేసి కాబోయే సీఎం అని మాత్రం అనకండి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చేతులెత్తి వేడుకున్నారట.