Motorola Signature : మోటోరోలా సంస్థ ‘సిగ్నేచర్’ పేరుతో ఫ్లాగ్ షిప్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. గోల్డ్ స్టాండర్డ్ ఫొటోగ్రఫీతో ఈ ఫోన్ రూపొందింది. ఫొటోలు, వీడియోలు తీసుకునేవారికి ఈ ఫోన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లివి.
6.8 అంగుళాల 1.5 కే అమోలెడ్ డిస్ ప్లే, 165 హెర్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్, 6.99 ఎంఎం మందం, 186 గ్రాములు బరువు, ఐపీ168+, ఐపీ 169 రేటింగ్, మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ చిప్ సెట్, 12జీబీ+256జీబీ, 16జీబీ+1టీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 16 ఓఎస్, అల్యూమినియం బాడీ, ట్రిపుల్ కెమెరా (50 ఎంపీ మెయిన్+50ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్+50ఎంపీ టెలిఫొటో సోనీ లెన్స్), 50 ఎంపీ సెల్ఫీ కెమెరా, 6,200 నిట్స్ బ్రైట్ నెస్, 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్, 50 వాట్స్ వైర్ లెస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్, 8కే వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లున్నాయి.
వీటి ధరలు సుమారు రూ.54,999 నుంచి వేరియెంట్ ను బట్టి రూ.69,999 వరకు ఉండే ఛాన్స్ ఉంది. ఈ నెల 30 నుంచి ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటుంది.