హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలిచినా ఫర్వాలేదని రాజీపడిన కాంగ్రెస్, మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచినా ఫర్వాలేదనే అభిప్రాయానికి వచ్చినట్టు టీపీసీసీ వర్గాల కథనం. మునుగోడులో బీజేపీ గెలిస్తే.. కాంగ్రెస్ నుంచి ఫిరాయింపులను ఆపలేమనీ, పైగా వచ్చే ఎన్నికల నాటికి బరి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ గెలిచినా ఫర్వాలేదు కానీ, బీజేపీని మాత్రం గెలువకుండా చూసేలా వ్యూహరచన చేస్తున్నట్టు ఈ వర్గాలు చెప్తున్నాయి.