ఆ.వె.: హరితహారం బెట్టి యడవిశాతం బెంచె
మొక్కలెన్నొ నాటి చక్కగాను
పచ్చదనము బెంచి ప్రకృతిని గాపాడె
భవిత తేలగాణ! భవ్య మగును!
ఆ.వె.: అడవినెంతొ బెంచె యధిక మొక్కలు నాటి
వర్షములను దెచ్చె కర్షకులకు
హర్షమొందె జనులు హరితహారం స్ఫూర్తి
భవిత తేలగాణ! భవ్య మగును!
ఆ.వె.: మెచ్చుచుండె జనులు మిషను కాకతీయను
చెరువులన్ని జూడ మెరుయు చుండె
జనులహృదిని దోచె జలమునంత నింపి
భవిత తేలగాణ! భవ్య మగును!
ఆ.వె.: బాటవెంట జూడ బంగారు రోడ్లయే
బాగు చేసినారు భద్రముగను
పల్లెరోడ్డు లన్ని మల్లెలాగ మెరిసె
భవిత తేలగాణ! భవ్య మగును!
ఆ.వె.: పాడిపంటలన్ని పచ్చని పైరులై
ప్రగతిజెందె నేడు పల్లెలన్ని
సంతరించు కొనెను స్వయము పోషకములై
భవిత తేలగాణ! భవ్య మగును!
– సాయిలు టేకుర్లా, 95734 64235