బీజేపీలోనూ టిక్కెట్ల లొల్లి షురువైంది. ఎవరికి వారే వచ్చే ఎన్నికల్లో తామే అభ్యర్థులమని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి చిర్రెత్తుకొచ్చింది. తనకు తెలియకుండా టిక్కెట్లు ఎట్లా వస్తవో చూస్తానని ఇటీవల పార్టీ సమావేశంలోనే బండి ఇంజిన్ గరం ఎక్కిపోయిందట. అలా ఎవరైనా ప్రకటించుకుంటే వాళ్లకు కచ్చితంగా టికెట్ రాదు. రాసి పెట్టుకొండని ఇంత ఎత్తున ఎగిరిండట. అలా చెప్పుకొన్న వాళ్లంతా చెల్లని రూపాయలేన ని, వాళ్లకు టిక్కెట్ ఎవ్వరిస్తారని ప్రశ్నించారట? దీంతో వేదిక మీద ఉన్న నాయకులంతా నోరెళ్లబెట్టారంటా..