అవినీతిపరులకు మరణశిక్ష విధించాలి!
దేశంలోని వ్యవస్థల్లో అవినీతి పాతుకుపోయింది. ఇటీవల రామమందిరంలో విరాళాల చోరీ ఘటన తెలిసిందే. ఈ చోరీ పట్ల స్పందించని ప్రజలు, ఇక ఏ అంశానికీ సిగ్గుపడలేరు. ప్రజల్లో నిజాయితీ ఏ స్థాయిలో పతనమైందో తెలిపే ఉదంతమిది. అవినీతి నిరోధక చట్టం-1988ను సవరించి అవినీతి కేసుల్లో దోషులకు మరణశిక్ష విధించాలి.
(బుల్డోజర్ చర్యలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారించి వెలువరించిన 51 పేజీల తీర్పులో అలహాబాద్ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ అతుల్ శ్రీధరన్ చేసిన వ్యాఖ్యల సారాంశం)
దేశంలోని వ్యవస్థల్లో అవినీతి పాతుకుపోయింది. ఇటీవల రామమందిరంలో విరాళాల చోరీ ఘటన తెలిసిందే. ఈ చోరీ పట్ల స్పందించని ప్రజలు, ఇక ఏ అంశానికీ సిగ్గుపడలేరు. ప్రజల్లో నిజాయితీ ఏ స్థాయిలో పతనమైందో తెలిపే ఉదంతమిది. అవినీతి నిరోధక చట్టం-1988ను సవరించి అవినీతి కేసుల్లో దోషులకు మరణశిక్ష విధించాలి. అవినీతి సాధారణమేనని సగటు భారత పౌరులు ఆలోచించే పరిస్థితి నెలకొన్నది. దొరికే వరకు కూడా ఇది తప్పు అని కూడా భావించడంలేదు. పారదర్శకత విషయంలో 2025లో జరిగిన అంతర్జాతీయ అధ్యయనంలో 182 దేశాల్లో భారత్‌కు 91వ స్థానం లభించింది. ఇది మనకు సిగ్గుచేటు కాదా? కేసులో పేరు నమోదైన వెంటనే, బుల్డోజర్ న్యాయం పేరుతో నిందితుల ఇండ్లను కూల్చివేయడం అంటే సమాజంలో ప్రతీకారంతో రగిలిపోయే మనుషుల హింసాత్మక పైశాచిక ఆనందాన్ని సంతృప్తి పరిచే చర్యగా కనిపిస్తున్నది. ఈ రక్తదాహానికి మీడియా, సోషల్ మీడియా మరింత ఆజ్యంపోస్తున్నాయి.
ఇండ్ల కూల్చివేతలపై సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. కానీ అలాంటివేమీ లేనట్టుగా, చట్టాలను ఇష్టారీతిన ధిక్కరించినా తమకు ఏమీ కాదనే ధీమాతో పాలకులు వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తున్నది. అసలు అక్రమ నిర్మాణాలు ఎలా వెలుస్తున్నాయి? నివాసాలు రాత్రికిరాత్రే ఏర్పాటు కావు కదా! అక్రమ నిర్మాణాలు జరుగకుండా చూడటం అధికార యంత్రాంగం విధి. బిల్డర్‌కు ఉన్న రాజకీయ పలుకుపడి వల్లనో, అవినీతి, లంచగొండితనం వల్లనో అధికారులు కండ్లు మూసుకుంటున్నారు. దీంతో బిల్డర్స్ ఇండ్లు నిర్మించి ప్రజలకు విక్రయిస్తున్నారు. దశాబ్దాల తర్వాత అవి అక్రమం అంటూ ప్రభుత్వం కూల్చివేస్తే ప్రజానీకం ఉన్నపళంగా ఇండ్లు ఖాళీ చేయాల్సిన దుస్థితి అనుభవిస్తున్నారు.
అక్రమ భవనాల నిర్మాణం, నీరు, విద్యుత్తు సరఫరాకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం కూడా నేరంలో భాగస్వామి అవుతుంది. దేశంలో అవినీతి కారణంగా సంపద కొంతమంది వ్యక్తు ల చేతుల్లోనే కేంద్రీకృతమవుతున్నది. ఈ ధోరణి భవిష్యత్తులో సామాజిక అశాంతికి దారి తీసే ప్రమాదమున్నది. వ్యవస్థలో అవినీతిని రూపుమాపాలని ప్రభుత్వం నిజంగా భావిస్తే, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి. చట్టాన్ని సవరించాలి. దోషులకు మరణ శిక్ష విధించేలా మార్పులు చేయాలి. నేరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత రెండేండ్ల వరకు ఇంటి కూల్చివేతకు పాల్పడవద్దు.
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

