ఈ భూమ్మీద మనుషులతోపాటు లక్షలాది జీవజాలం కూడా ఉంది. మరి మనలాగే జంతువులు కూడా ఎంజాయ్ చేస్తాయా? అంటే సమాధానం ఏం చెప్తాం? ఇదిగో ఇప్పుడు మనం చూసే వీడియో కూడా అలాంటిదే. కొన్ని తాబేళ్లు చెరువులో పడిన ఒక దుంగపై నిలబడి ఉయ్యాల ఊగుతూ కనిపించాయి. ఆ దుంగ ఊగుతూ ఉండటంతో ఒకదాని తర్వాత ఇంకోటి నీళ్లలో పడిపోయాయి.
అలా చివరకు మూడు మాత్రమే మిగిలాయి. ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు నవ్వేస్తున్నారు. ఈ పోటీలో ఎవరు గెలిచారో మాత్రం తెలియడం లేదే? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే.. అంతలా ఊగిపోతున్న దుంగ మీదకు ఈ తాబేళ్లను ఎవరు ఎక్కించారు? అని అడుగుతున్నారు.
ఇది కచ్చితంగా తాబేళ్ల ప్రేమే అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ట్విట్టర్లో ఈ వీడియోకు ఇప్పటికే37 లక్షలపైగా లైక్స్, 54 లక్షలపైగా వ్యూస్ వచ్చాయి.
I like this game.. 😂 pic.twitter.com/F0JZNKxkAS
— Buitengebieden (@buitengebieden) June 5, 2022