Stunning Photo of Cobras | సాధారణంగా పాము పేరు చెబితేనే భయంతో అల్లంత దూరం పరిగెత్తుతాం. అలాంటిది ఒకే చోట.. అది కూడా ఏకంగా నల్ల తాచు కనిపిస్తే ఇంకేమైనా ఉందా… ఒక్క నిమిషం పాటు భయంతో గుండె ఆగిపోతుంది. తాజాగా ఈ కోవకు చెందిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మహారాష్ట్రలో ఈ అరుదైన దృశ్యం కనిపించింది.
ఒక మొద్దుకు మూడు నల్ల తాచులు పెనవేసుకుని.. పడగవిప్పి మరీ ఫోటోకు ఫోజుచ్చాయి. తొలుత ఈ ఫోటో ఇండియన్ వైల్డ్ లైఫ్‌లో మంగళవారం కనిపించింది. జనావాసంలోకి ప్రవేశించిన ఈ పాములను పట్టుకుని అడవిలో వదిలేసే సమయంలో ఈ ఫోటోని క్లిక్‌మనిపించారు.
అమరావతి హరిసాల్ అటవీ ప్రాంతంలో తీసిన ఈ ఫోటోలను రాజేంద్ర సెమాల్కర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. హరిసాల్ అటవి ప్రాంతంలో దర్శనమిచ్చిన మూడు తాచులు అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. ఇప్పటి వరకు 4700 మందికి పైగా యూజర్లు దీన్ని లైక్ చేశారు.
రాజేంద్ర సెమాల్కర్ షేర్ చేసిన ఫోటోల్లో ఒకటి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న ఫోటో. దీన్ని సుశాంత నంద అనే ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విటర్లో షేర్ చేశారు. ఇది చూసిన నెటిజనులు.. ‘దూరం నుంచి చూస్తే చాలా అందంగా కనిపిస్తున్నా.. దగ్గరకెళ్తే ముచ్చెమటలు ఖాయం’, ‘ముగ్గురు తల్లులు ఒకేసారి ఆశీర్వదిస్తున్నట్లు ఉంది’, ‘ఒక్క క్షణం భయంతో గుండాగిపోయింది’ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
Blessings…
— Susanta Nanda IFS (@susantananda3) November 16, 2021
When three cobras bless you at the same time.
🎬:Rajendra Semalkar. pic.twitter.com/EZCQTumTwT
#Vidarbha
— Shashank Gattewar (@SGattewar_NGP) November 16, 2021
Magical Melghat, Spotted 3 Cobra In Harisal Forest of #Melghat
© Rajendra Semalkar pic.twitter.com/xD26dLr1pA