బీజింగ్ : పార్కిన్సన్స్ వంటి వ్యాధుల విషయంలో దీటైన చికిత్సలకు ముందడుగు పడేలా శాస్త్రవేత్తలు అరుదైన ఘనత సాధించారు. చైనా శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే తొలి హై రిజల్యూషన్‌తో కూడిన మంకీ బ్రెయిన్ త్రీడీ ఇమేజ్ను అభివృద్ధి చేశారు. ఫ్లోరోసెంట్ ఇమేజింగ్ టెక్నిక్స్ ఉపయోగించి కోతి మెదడుకు సంబంధించిన పూర్తి మ్యాప్‌ను బీజింగ్‌కు చెందిన చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రతినిధులు సృష్టించారు.
వ్యాల్యూ మెట్రిక్ ఇమేజింగ్ ద్వారా వీరు పదేండ్ల వయసు కలిగిన మూడు కోతుల మెదళ్లను పరీక్షించారు. నేచర్ బయోటెక్నాలజీ జర్నల్‌లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. త్రీడీ ఇమేజ్ కోట్లాది న్యూరాన్లను అసాధారణ వివరాలతో క్యాప్చర్ చేయడంతో ఫలితాలను అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తల బృందం కృత్రిమ మేధను ఉపయోగిస్తోందని డైలీ మెయిల్ పేర్కంది. కోతి మెదడు కంటే 17 రెట్లు అధికంగా ఉండే మానవ మెదడుతో అధ్యయన వివరాలను పోల్చడం ద్వారా పరిశోధకులు కీలక ఆవిష్కరణల దిశగా పలు వివరాలను రాబట్టనున్నారు.