క్రెడిట్ కార్డు పొందాలంటే ఎక్కడైనా సరే.. ఏ దేశంలో అయినా సరే.. క్రెడిట్ హిస్టరీ బాగుండాలి. మన దేశంలో అయితే సిబిల్ స్కోర్ చూస్తారు. అది ఎక్కువ ఉంటేనే క్రెడిట్ కంపెనీలు, బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు.. క్రెడిట్ కార్డును ఇష్యూ చేస్తాయి.
జపాన్ కూడా దీనికి అతీతం కాదు. అక్కడ కూడా క్రెడిట్ హిస్టరీ లేని కస్టమర్లకు బ్యాంకులు.. క్రెడిట్ కార్డు జారీ చేయవు. ముఖ్యంగా యువతకు. ఎందుకంటే.. యువతలో ఎక్కువ శాతం మందికి సంపాదన ఉండదు. ఉన్నా.. అంతంత మాత్రంగానే ఉంటుంది. అందుకే.. క్రెడిట్ కార్డులను క్రెడిట్ హిస్టరీ లేని యువతకు ఇవ్వడానికి బ్యాంకులు ఒప్పుకోవు. ఇదే పాయింట్ మీద రషెల్ కమ్మర్ అనే వ్యక్తికి ఓ ఆలోచన తట్టింది. అందులోనూ తనకు కూడా క్రెడిట్ కార్డు రిజెక్ట్ అయిన అనుభవం ఎదురైంది. అలా పుట్టుకొచ్చిందే పెయిడీ కంపెనీ.
అవును.. మనం మాట్లాడుకునే వ్యక్తి రషెల్ క్రెడిట్ కార్డు అప్లికేషన్‌ను రిజెక్ట్ చేశారు. ఆయనకు క్రెడిట్ కార్డు ఇవ్వకపోవడంతో.. క్రెడిట్ కార్డు కంటే తాత కార్డును యువతకు అందివ్వాలనుకున్నాడు. అది కూడా క్రెడిట్ హిస్టరీ లేకుండా. అందుకే.. ఇప్పుడు ఆయన కంపెనీ 1.2 బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగింది.
నాకే నా మొదటి క్రెడిట్ కార్డు పొందడం చాలా కష్టంగా మారింది. నేను మొదటి సారి క్రెడిట్ కార్డు కోసం అప్లయి చేస్తే రిజెక్ట్ చేశారు. అప్పుడే.. క్రెడిట్ కార్డు కన్నా బెటర్ కార్డును.. అది కూడా క్రెడిట్ కార్డుకు అల్టర్నేట్ కార్డును యూత్‌కు అందివ్వాలని అనుకున్నాను.. అంటూ రషెల్ చెప్పుకొచ్చారు.
2014లో రషెల్.. బీఎన్‌పీఎల్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. బీఎన్‌పీఎల్ అంటే.. బయ్ నవ్.. పే లేటర్. అంటే.. మీకు నచ్చిన వస్తువులు డబ్బులు లేకున్నా కొనుక్కోండి. తర్వాత పే చేయండి.. అనే నినాదంతో ముందుకెళ్లాడు రషెల్.
2018 లో ఆ కంపెనీ పేరును పెయిడీగా మార్చాడు. గత మార్చ్‌లో ఈ కంపెనీ 120 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. ప్రస్తుతం ఈ కంపెనీ వాల్యూ 1.2 బిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు 8763 కోట్ల రూపాయలు. అంతే కాదు.. ప్రస్తుతం జపాన్‌లో 1 బిలియన్ డాలర్ల వాల్యూ ఉన్న ఆరు టాప్ కంపెనీలలో పెయిడీ ఒకటి. 1 బిలియన్ డాలర్ల వాల్యూను ఏ కంపెనీ అయితే దాటుతుందో దాన్ని యూనికార్న్ కంపెనీ అంటారు. అంటే.. ఎక్కువ వాల్యూ కలిగిన స్టార్టప్ అన్నమాట.
రషెల్.. తన కెరీర్ స్టార్టింగ్‌లో టోక్యోలో గోల్డ్‌మ్యాన్ అనే కంపెనీలో క్రెడిట్ ట్రేడర్‌గా పనిచేసేవాడు. అప్పుడే తన క్రెడిట్ కార్డు రిజెక్ట్ అయింది. ఆ తర్వాత క్రెడిట్ కార్డుకు అల్టర్నేట్గా బీఎన్‌పీఎల్ కార్డులను ప్రవేశపెట్టాడు. ఈ కంపెనీ నుంచి కార్డు తీసుకున్న కస్టమర్లు.. తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయొచ్చు. గడువు తేదీ లోపు రీపే చేసుకోవచ్చు. ఇన్స్టాల్మెంట్ ప్లాన్స్ కూడా ఇందులో ఉంటాయి. అవి కూడా జీరో ఇంటరెస్ట్‌తో. సాధారణంగా క్రెడిట్ కార్డు ఈఎంఐ మీద వడ్డీ వసూలు చేస్తారు. కానీ.. రషెల్ మాత్రం తన కంపెనీ నుంచి ఇచ్చే కార్డుతో ఎటువంటి వడ్డీ వసూలు చేయరు. అదే అక్కడి యువతను బాగా ఆకర్షించింది. అలాగే.. కోవిడ్ టైమ్‌లో కూడా రషెల్ కంపెనీ ఒక్కసారిగా ఎగబాకింది. అప్పుడు చాలామంది ఈ కార్డును తీసుకోవడానికి ముందుకు వచ్చారు.
ఇప్పుడు ఆ కంపెనీకి ఇన్వెస్టర్లు క్యూ కడుతున్నారు. రషెల్ ఇదివరకు పని చేసిన గోల్డ్‌మ్యాన్ కంపెనీ కూడా రషెల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కూడా తన యాపిల్ పే ప్రోగ్రామ్ ద్వారా ఈ కంపెనీతో ఒప్పందం కుదర్చుకోవడానికి సన్నాహాలు చేస్తోంది.
ఈ కామర్స్ సైట్ల నుంచి, యాపిల్ వెబ్ సైట్ నుంచి.. ఇతర ఆన్లైన్ షాపింగ్‌ల కోసం ఈ కార్డును ఉపయోగించుకొని.. వడ్డీ లేని ఈఎంఐలను ఎంచుకోవచ్చు. కార్డు లావాదేవీలకు సంబంధించిన ఫీజు, సెటిల్మెంట్ ఫీజు, లేట్ ఫీజు.. ఇవన్నీ నామమాత్రంగానే వసూలు చేస్తారు. కేవలం.. వీటి ద్వారానే కంపెనీ లాభాలను గడిస్తోంది.
అయితే.. రషెల్కు ప్రస్తుతం ఉన్న ఈ బిలియన్ డాలర్ల కంపెనీ ఒక్క రాత్రిలో వచ్చింది కాదు. 2014 లో ఈ కంపెనీని స్థాపించడానికి ముందే.. ఎక్స్ఛేంజ్ కార్పొరేషన్ అనే కంపెనీని 2008లో స్థాపించాడు. గోల్డ్‌మ్యాన్ కంపెనీలో తనతో పాటు పనిచేసిన తన కొలిగ్స్ ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టినా.. ఆ కంపెనీ అనుకున్నంతగా రాణించలేదు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి.. తన తండ్రిని రెండు సార్లు డబ్బులు అడిగి చెల్లించాడట. చివరకు.. ఆ కంపెనీ మూతపడింది. 2014లో బీఎన్‌పీఎల్‌కు అంకురార్పణ జరిగాక.. తన జీవితమే మారిపోయింది. మధ్యలో కొన్ని రోజులు ఈ కంపెనీ మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ.. యూత్‌కు తమ సంపాదనకు మించి ఖర్చు పెట్టేలా ఈ కార్డు అవకాశం కల్పిస్తోందంటూ విమర్శలు వచ్చినా.. అవి ఆ కంపెనీ గ్రోత్‌ను మాత్రం ఆపలేకపోయాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Tata Super app | అటకెక్కిన టాటా సన్స్ `సూపర్ యాప్`.. వెయిట్ & సీ పాలసీనా ?
wireless charging room | గాలితోనే మీ ఫోన్ చార్జింగ్ చేసుకోవచ్చు.. ఎలా?
PNB Festive offer | పీఎన్బీ ఫెస్టివల్ ధమాకా.. ఈ రుణాలపై చార్జీలు మాఫీ!
Hero Electric | హీరో ఎలక్ట్రిక్ ఆఫర్లు.. కస్టమర్లకు ఈజీ ఫైనాన్సింగ్.. అవేంటంటే?!