Tata Super app | అటకెక్కిన టాటా సన్స్ `సూపర్ యాప్`.. వెయిట్ & సీ పాలసీనా ?
Tata Super app | ఒకే ప్లాట్‌ఫామ్ నుంచి వినియోగదారులకు అన్ని వస్తువులు, సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే సూపర్ యాప్ఆవిష్కరించాలన్న ప్రతిపాదనను....

Tata Super app | ఒకే ప్లాట్‌ఫామ్ నుంచి వినియోగదారులకు అన్ని వస్తువులు, సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే సూపర్ యాప్ఆవిష్కరించాలన్న ప్రతిపాదనను టాటా సన్స్ అటకెక్కించింది. కేంద్రం రూపొందించిన వినియోగదారుల పరిరక్షణ నిబంధనల ముసాయిదాపై స్పష్టత వచ్చిన తర్వాత సూపర్ యాప్‌ను ఆవిష్కరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఇలా అన్ని సేవల కోసం
ఒకే వేదిక నుంచి కన్జూమర్ డ్యూరబుల్స్, ఫుడ్ అండ్ గ్రాసరీ, ఫైనాన్సియల్ సేవలు తదితరాలను ప్రజలను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ-కామర్స్ యాప్ అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నది. టాటా సన్స్ అనుబంధ టాటా డిజిటల్ ఆధ్వర్యంలో ఈ నెలాఖరులో సూపర్ యాప్‌ను ఆవిష్కరించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయాయి. తద్వారా ఇప్పటికే ఈ-కామర్స్‌లో పోటాపోటీగా దూసుకెళ్తున్న అమెజాన్, వాల్‌మార్ట్ ఆధారిత ఫ్లిప్‌కార్ట్, ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ సంస్థలతో పోటీ పడేందుకు సూపర్ యాప్ తేవాలని సంకల్పించింది టాటా సన్స్.
ఒకే సంస్థ వస్తువుల విక్రయంపై బ్యాన్
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వినియోగదారుల (ఈ-కామర్స్) పరిరక్షణ నిబంధనలు-2020 అమలులోకి వస్తే టాటా సూపర్ యాప్ నిర్వహణపై ప్రతికూల ప్రభావం పడేది. ఒకే సంస్థ పరిధిలోని వస్తువులను దీనికింద విక్రయించరాదు. ఈ నిబంధనల ప్రకారం టాటా సూపర్ యాప్.. ఒక ఈ-కామర్స్ సంస్థగా పరిగణిస్తారు.

ప్రత్యక్ష.. పరోక్ష సంబంధాలుంటే..
పలు సంస్థల నుంచి భారీ మొత్తంలో వస్తువులను సేకరించి వినియోగదారులకు అందుబాటులోకి తేవడానికి టాటా సూపర్ యాప్ ఏర్పాటవుతున్నది. కేంద్ర ప్రతిపాతిద నిబంధనల ప్రకారం సదరు యాప్‌తో లేదా ఈ-కామర్స్ సంస్థతో నేరుగా గానీ, పరోక్షంగా గానీ సంబంధం ఉన్న సంస్థల వస్తువులను ఈ వేదిక నుంచి విక్రయించడానికి అనుమతించరు. ఆన్లైన్లో చివరి కస్టమర్‌కు సేవలందించే డెలివరీ పార్టనర్‌ను కూడా సంబంధిత సంస్థకు అనుబంధం అని పేర్కొనడం పెద్ద అవరోధం అని ఈ-కామర్స్ సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి.
అవరోధంగా కేంద్రం ప్రతిపాదిత రూల్స్
గత జూలైలో ప్రతిపాదిత ఈ-కామర్స్ నిబంధనల ముసాయిదాపై ఈ-కామర్స్ సంస్థల నుంచి అభిప్రాయాలను ఆహ్వానించింది. ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ నుంచి దేశీయ రిటైల్ సంస్థలు, వ్యాపారుల పరిరక్షణకు ఈ నిబంధనలను తీసుకొచ్చింది కేంద్రం. కానీ ఆచరణలో స్థానిక సంస్థలకు అవరోధంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రిటైల్పైనే రిలయన్స్ ఫోకస్
రిలయన్స్ రిటైల్ మాత్రం తాము రిటైల్ లావాదేవీలపైనే ఫోకస్ చేశామని చెబుతోంది. ప్రతిపాదిత వినియోగదారుల పరిరక్షణ నిబంధనలను అమలులోకి తీసుకొస్తే జియో ప్లాట్‌ఫామ్‌తో కలిసి పని చేసే అంశంపై పునఃసమీక్షించుకుంటామంటున్నది.
ఇవి కూడా చదవండి :
Pawan : పవన్ బర్త్ డే: క్రేజీ అప్డేట్ ఇచ్చిన హరిహర వీరమల్లు టీం
భీకర వానలతో న్యూయార్క్ అస్తవ్యస్తం..
wireless charging room | గాలితోనే మీ ఫోన్ చార్జింగ్ చేసుకోవచ్చు.. ఎలా?
Instagram Down : ఇన్స్టాగ్రామ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. సర్వర్ డౌన్.. పనిచేయని యాప్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

