Hero Electric | హీరో ఎలక్ట్రిక్ ఆఫర్లు.. కస్టమర్లకు ఈజీ ఫైనాన్సింగ్.. అవేంటంటే?!
Hero Electric | ఎలక్ట్రిక్ టూ వీలర్స్ రంగంలో తన మార్కెట్ పెంచుకునేందుకు హీరో ఎలక్ట్రిక్ ముందుకెళ్తోంది. ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కొనుగోలు చేయడానికి////

Hero Electric | ఎలక్ట్రిక్ టూ వీలర్స్ రంగంలో తన మార్కెట్ పెంచుకునేందుకు హీరో ఎలక్ట్రిక్ ముందుకెళ్తోంది. ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కొనుగోలు చేయడానికి కస్టమర్లకు ఈజీ ఫైనాన్సింగ్ ఆప్షన్లను అందజేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం టూ వీలర్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ కంపెనీ వీల్స్ ఈఎంఐతో జట్టు కట్టినట్లు మంగళవారం ప్రకటించింది. కస్టమర్ల అర్హతలను బట్టి వెహికల్ ఫైనాన్సింగ్ ద్వారా ఆకర్షణీయ వడ్డీరేట్లు, ఫ్లెక్సిబుల్ టెన్యూర్, తక్కువ నెల వాయిదాలు (ఈఎంఐ) వంటి అదనపు బెనిఫిట్లతో కూడిన ఆఫర్లు కల్పిస్తోంది.
13 రాష్ట్రాల్లో వీల్స్ ఈఎంఐ సేవలు
తక్కువ పత్రాల (minimum documentation) తో త్వరితగతిన సరళంగా, త్వరితగతిన ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కొనుగోలుదారులకు రుణ పరపతి కల్పిస్తుంది వీల్స్ ఈఎంఐ. 13 రాష్ట్రాల్లో 100 నగరాలకు పైగా వీల్స్ ఈఎంఐ వినియోగదారులకు సేవలందిస్తోంది.
కస్టమర్ల కోసమే వీల్స్ ఈఎంఐతో పార్టనర్ షిప్
గత కొన్ని వారాలుగా వివిధ కారణాల వల్ల ఎలక్ట్రిక్ టూ వీలర్స్ పట్ల ప్రజల్లో అవగాహన, డిమాండ్ పెరిగిందని హీరో ఎలక్ట్రిక్ సీఈవో సోహిందర్ గిల్ తెలిపారు. ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌ను తమ తదుపరి వెహికల్స్‌గా చాలా మంది పరిగణిస్తున్నారన్నారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల నుంచి ఫ్లెక్సిబుల్ ఫైనాన్స్ ఆప్షన్ల కోసం డిమాండ్ పెరుగుతుందన్నారు. ఈ క్రమంలోనే తాము వీల్స్ ఈఎంఐతో పార్టనర్షిప్ దిశగా ముందడుగు వేశామని చెప్పారు.
హీరో ఎలక్ట్రిక్ భాగస్వామ్యంతో కస్టమర్లకు బెనిఫిట్
వీల్స్ ఈఎండీ సహ వ్యవస్థాపకుడు, సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ వీ కరుణాకరన్ మాట్లాడుతూ టూ వీలర్స్ ఫైనాన్సింగ్‌లో తమ కంపెనీ స్పెషలిస్టు అని తెలిపారు. ఈ-టూ వీలర్స్, రూరల్ కస్టమర్లపైనా ఫోకస్ చేశామన్నారు. హీరో ఎలక్ట్రిక్‌తో భాగస్వామ్యం వల్ల బ్యాంకింగ్ సౌకర్యం లేని గ్రామీణ కస్టమర్లకు లబ్ధి చేకూరుస్తుందన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- hero electric
- wheels emi
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

