7వేల మంది అరెస్ట్
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) శనివారం జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన నిరసనను కేంద్రం ఉక్కుపాదంతో అణచివేసింది. కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా బలగాలను మోహరించి నిరసనకారులను ఎక్కడికక్కడ నిర్బంధించింది. సీజేపీ నాయకుడు అభిజీత్ దీప్కే, నలుగురు మాజీ ముఖ్యమంత్రులు, యూట్యూబర్ ధ్రువ్ రాఠీతోసహా 7,000 మందికిపైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నది.
- నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
- విమానంలోనే దీప్కే నిర్బంధం.. ఢిల్లీలో నలుగురు మాజీ సీఎంలు అదుపులోకి
- శత్రుదుర్భేద్య కోటగా జంతర్‌మంతర్.. దేశంలో సూపర్ ఎమర్జెన్సీ: విపక్షాల ఫైర్
- సీజేపీ ఆందోళనపై మోదీ సర్కార్ ఉక్కుపాదం
- దేశవ్యాప్తంగా 7 వేల మందికిపైగా అరెస్ట్
న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) శనివారం జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన నిరసనను కేంద్రం ఉక్కుపాదంతో అణచివేసింది. కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా బలగాలను మోహరించి నిరసనకారులను ఎక్కడికక్కడ నిర్బంధించింది. సీజేపీ నాయకుడు అభిజీత్ దీప్కే, నలుగురు మాజీ ముఖ్యమంత్రులు, యూట్యూబర్ ధ్రువ్ రాఠీతోసహా 7,000 మందికిపైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నది. నిరసనలకు కేటాయించిన జంతర్ మంతర్ ప్రాంతం శనివారం రోజంతా నిర్మానుష్యంగా కనిపించింది.
నిరసనకారులను ఆ ప్రాంతానికి రాకుండా అడ్డుకునేందుకు రాజధానిలో 30,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించడంతో పాటు వరుసగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఈ పరిస్థితిని అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ) కంటే దారుణమైనదిగా అభివర్ణించాయి. సీజేపీ పిలుపునిచ్చిన నిరసనలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తుండగా మాజీ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్(ఆప్), మమతా బెనర్జీ(టీఎంసీ), పినరయి విజయన్ (సీపీఎం), మాణిక్ సర్కార్(సీపీఎం)తోసహా పలువురు ప్రతిపక్ష నాయకులను రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది అత్యవసర పరిస్థితిని మించిపోయింది.

Kejriwal Arrest
ఇది ఒక ‘సూపర్ ఎమర్జెనీ’గా మారింది అని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, సీనియర్ వామపక్ష నాయకురాలు బృందా కారత్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ఆల్ ఇండియా సూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) అధ్యక్షురాలు నేహా బోరాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చెన్నైలో జరిగిన ఛాతోన్కీ గూంజ్(విద్యార్థుల గళం) కార్యక్రమంలోపాల్గొన్న రాహుల్ గాంధీ పిరికితనమే ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ ప్రధాన లక్షణం అని వ్యాఖ్యానించారు. సీజేపీ నేతలు దీప్కే, సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకాలను ముంబై నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో పోలీసులు అరెస్టు చేశారు. యూట్యూబర్ ద్రువ్ రాఠీని గురుగ్రామ్‌లోని ఆయన ఇంట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శనివారం రాత్రి మాజీ సీఎంలు సహా ఆందోళన కారులను పోలీసులు విడుదల చేశారు. సీజేపీ నేతలను మాత్రం విడుదల చేయలేదు.

Manik Sarkar Arrest
ఇందిరా గాంధీ కూడా ఇలా చేయలేదు!
దీప్కేతోపాటు ఇద్దరు నాయకులను ఒక మహిళా పోలీసు అధికారి విమానం లోపల అరెస్టు చేస్తున్న దృశ్యాలతో ఒక వీడియో బయటకు వచ్చింది. దేశం ఏ దిశగా వెళుతున్నదో మీరు చూడవచ్చు. మమ్మల్ని విమానం లోపలే నిర్బంధించారు. ఇందిరా గాంధీ కూడా ఎప్పుడూ ఇలా చేయలేదు. ఇది నియంతృ త్వం. కానీ వారికి మేము భయపడము అని దీప్కే పోలీసు అధికారితో అనడం వీడియోలో కనిపించింది.
పోలీసు అధికారులను ఉద్దేశిస్తూ రండి.. మమ్మల్ని అరెస్టు చేయండి. మేము అరెస్టు కావడానికే వచ్చాము. నాకు మీరంటే భయం లేదు. మేము అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నా ము అని దీప్కే అన్నారు. ఇందుకు పోలీసు అధికారి స్పందిస్తూ ఇది అరెస్టు కాదు. దయచేసి సహకరించండి అని కోరడం కనిపించింది. విమా నం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పోలీసు అధికారితో దీప్కే ఏ జైల్లో నన్ను ఉంచుతున్నారు. రాజస్థాన్‌లోని జైలుకా? ఎన్ఎస్ఏ లేదా యూఏపీఏ కేసులు నాపైన పెట్టుకోండి అని అనడం ఆ వీడియోలో వినిపించింది.

Protestors Arrest In Van
ఆకాశవాణి భవన్ వద్ద ఉద్రిక్తత
ఇంతియాజ్ అలీ మార్గ్‌లోని ఆకాశవాణి భవన్ సమీపంలో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వందలాది మంది నిరసనకారులు బారికేడ్లు దూకి భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వడంతో ఇద్దరు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. నిరసనకారులను భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ ఆలయ సమీపంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడ కొంతమంది నిరసనకారులు భద్రతా సిబ్బందిపై రాళ్లు విసిరారు. నిరసనకారులను అదుపులోకి తీసుకునే సమయంలో ఏడుగురు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి.
సీజేపీ నిరసన కార్యక్రమానికి ముందు 30,000 మందికి పైగా పోలీసు, పారామిలిటరీ సిబ్బందిని మోహరించడంతో శనివారం ఢిల్లీ నగరం దాదాపుగా పోలీసులమయంగా మారింది. దేశవ్యాప్తంగా శనివారం 7,000 మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారని, ఇందులో న్యూఢిల్లీ ప్రాంతంలోనే 2,000 మందికి పైగా ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. సీజేపీ చేపట్టిన నిరసనకు మద్దతుగా సుప్రీం కోర్టు ఆవరణకు సమీపంలో ఆందోళన చేస్తున్న 60 మంది న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పలువురు మహిళా న్యాయవాదులు కూడా ఉన్నారు. అయితే ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ జోక్యంతో వారిని విడుదల చేశారు.

Vijayan Arrest
నటుడు ఇమ్రాన్‌ఖాన్ అరెస్ట్
సీజేపీ శనివారం జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన నిరసనకు మద్దతుగా ముంబైలోని ఆగస్టు క్రాంతి మైదాన్‌లో ధర్నా చేపట్టారు. ఈ నిరసనల్లో పాల్గొన్న నటుడు ఇమ్రాన్‌ఖాన్‌తో పాటు 400 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్రాంతి మైదాన్‌తో పాటు అనేక చోట్ల ఈ అరెస్టుల పర్వం కొనసాగింది.
అజింక్యా షిండేకు నిరసన సారథ్య బాధ్యత
సీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో నిరసన కార్యక్రమానికి నాయకత్వం వహించే బాధ్యతను మహారాష్ట్ర నేత అజింక్యా షిండేకు సీజేపీ అప్పగించింది.
మరింత బలంగా వీధుల్లోకి వస్తాం: సీజేపీ
సీఈసీ రాజీనామా కోరుతూ తాము ఢిల్లీలో చేపట్టిన ఆందోళన సగం మాత్రమే విజయవంతమైందని సీజేపీ పేర్కొంది. అయితే తమ ఆందోళనను ఆదివారం కూడా కొనసాగిస్తామని తెలిపింది. పోలీసుల నిర్బంధం, పలువురు నేతలను అదుపులోకి తీసుకున్న కారణంగా తాము చేపట్టిన ఉద్యమంలో సగమే విజయం సాధించినట్టు సీజేపీ నేత అజింక్యా షిండే తెలిపారు. తమ నిరసనకు భయపడి ప్రభుత్వం దేశ రాజధానిని మూసివేయడానికి సిద్ధపడిందన్నారు. ఈ రోజు తీవ్ర అణచివేతలు సాగించినా ఆదివారం మరింత బలంగా వీధుల్లోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జ్ఞానేశ్ రాజీనామా చేసేవరకు ఆందోళన కొనసాగుతుందన్నారు.

Imran2
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

