Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
Saudi Arabia : సౌదీ అరేబియా రాజధాని రియాద్(Ryadh)లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై తాజా దాడిలో 12 మంది మృతి చెందారు. ఇరాన్ మద్దతుతో పెట్రేగిపోతున్న హౌతీలు మిస్సైల్ (Missile)తో జరిపిన ఈ దాడిలో మూడొందలకు పైగా మంది గాయపడ్డారని పౌర విమానయాన వర్గాలు ఆదివారం ఉదయం వెల్లడించాయి.
Saudi Arabia : సౌదీ అరేబియా రాజధాని రియాద్ (Ryadh)లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై తాజా దాడిలో 12 మంది మృతి చెందారు. ఇరాన్ మద్దతుతో పెట్రేగిపోతున్న హౌతీలు మిస్సైల్ (Missile)తో జరిపిన ఈ దాడిలో మూడొందలకు పైగా మంది గాయపడ్డారని పౌర విమానయాన వర్గాలు ఆదివారం ఉదయం వెల్లడించాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఒక అరేబియా దేశంపై ఇంతటి స్థాయిలో దాడి జరగడం ఇదే మొదటిసారి.
హౌతీల తిరుగుబాటుదారులు మరోసారి సౌదీ అరేబియాపై విరుచుకుపడ్డారు. ఈసారి రాజధాని రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణితో దాడికి పాల్పడ్డారు. కింగ్ ఖలిద్ విమనాశ్రయంలోని డొమెస్టిక్ విమానాలకు కేటాయించిన టెర్మినల్ 3, 4పై హౌతీలు మిస్సైల్‌ను ప్రయోగించారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో12 మంది ప్రాణాలు కోల్పోగా, మూడొందలకు పైగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు సౌదీ పౌరులు, ఇద్దరు బంగ్లాదేశీయులతో పాటు పాలస్తీనా, ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, సూడాన్‌కు చెందిన పౌరులు ఉన్నారని సౌదీ ప్రభుత్వం తమ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ దాడిలో గాయపడిన వారికి పలు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నామని అధికారులు చెప్పారు.
🇸🇦🇺🇸A US citizen is DEAD after Saudi airport attack
12 lives lost, over 300 wounded and counting…
King Khalid Airport in Riyadh is in total CARNAGE.
Officials insist the conflict is “contained,” while ballistic missiles flatten civilian departure lounges and KILL travelers from nine other nations.
This isn’t distant crossfire anymore, it’s a full-scale international inferno.
Writer: Bri
https://t.co/eBvPg9qvO0— Mario Nawfal (@MarioNawfal) October 10, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

