బౌలర్లకు మరో సవాల్
భారత్, వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో బౌలర్ల కష్టాలు ముగిసేలా కనిపించడం లేదు. రాంచీలో జరిగిన రెండో టీ20లో 38.3 ఓవర్లలోనే ఏకంగా 501 పరుగులు నమోదు కాగా, అందులో 352 కేవలం బౌండరీల రూపంలోనే వచ్చాయి. భారత్ ఇచ్చిన 250 పరుగుల కొండంత లక్ష్యాన్ని వెస్టిండీస్ మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించి సంచలనం సృష్టించింది. ఒకే రోజు విరామం తర్వాత ఇరు జట్ల బౌలింగ్ విభాగాలు బ్యాటింగ్‌కు స్వర్గధామంగా పేరొందిన ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మరో పరీక్షకు సిద్ధమయ్యాయి.
- నేడు విండీస్‌తో భారత్ మూడో టీ20
- రాత్రి 7 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియోస్టార్‌లో లైవ్
ఇండోర్: భారత్, వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో బౌలర్ల కష్టాలు ముగిసేలా కనిపించడం లేదు. రాంచీలో జరిగిన రెండో టీ20లో 38.3 ఓవర్లలోనే ఏకంగా 501 పరుగులు నమోదు కాగా, అందులో 352 కేవలం బౌండరీల రూపంలోనే వచ్చాయి. భారత్ ఇచ్చిన 250 పరుగుల కొండంత లక్ష్యాన్ని వెస్టిండీస్ మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించి సంచలనం సృష్టించింది. ఒకే రోజు విరామం తర్వాత ఇరు జట్ల బౌలింగ్ విభాగాలు బ్యాటింగ్‌కు స్వర్గధామంగా పేరొందిన ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మరో పరీక్షకు సిద్ధమయ్యాయి.
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఈ వేదికపై మూడో మ్యాచ్ జరగనుంది. చెరో టీ20 నెగ్గి 1-1తో సమంగా ఉన్న భారత్, విండీస్‌కు ఈ మ్యాచ్ ఫలితం కీలకం కానుంది. రెండేండ్ల విరామం తర్వాత ఇండోర్ ఓ టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఈ స్టేడియంలో జరిగిన చివరి మూడు వన్డేల్లో 399, 385, 337 వంటి భారీ స్కోర్లు నమోదయ్యాయి. చిన్న బౌండరీలు, బ్యాటింగ్‌కు అనుకూలించే వికెట్ ఇక్కడ రికార్డు స్కోర్లకు దోహదపడతాయి. ఈ పర్యటనలో ఇప్పటివరకు జరిగిన 5 మ్యాచ్‌ల్లోనూ (3 వన్డేలు, 2 టీ20లు) ఛేజింగ్ చేసిన జట్లే విజయాలు సాధించడం విశేషం. కానీ, ఇండోర్‌లో గతంలో 200 ప్లస్ స్కోరు చేసిన ప్రతిసారీ ఆ స్కోర్లను విజయవంతంగా కాపాడుకోవడం గమనార్హం.
బౌలర్లు పుంజుకుంటారా?
బ్యాటింగ్‌లో భారత్‌కు తిరుగులేదు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఫామ్‌లో ఉండగా.. గత రెండు ఇన్నింగ్స్‌ల్లో 102 నాటౌట్, 40 స్కోర్లతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మళ్లీ తన పాత ఫామ్‌ను అందుకోవడం సానుకూలాంశం. స్వల్ప తడబాటు తర్వాత శాంసన్ రాంచీలో టచ్‌లోకి రావడంతో సూర్యవంశీ వేచి చూడక తప్పదు. మిడిలార్డర్లో తిలక్ తడాఖా చూపెడుతున్నాడు. కానీ, బౌలింగ్‌పైనే ఆందోళన ఉంది. ప్రధాన పేసర్ అర్ష్‌దీప్ సింగ్ గత రెండు మ్యాచ్‌ల్లో 79 పరుగులు ఇచ్చి ఒకే ఒక్క వికెట్ తీయడం జట్టును కలవరపెడుతోంది.
మయాంక్ తన ఎక్స్‌ప్రెస్ వేగంతో 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇక, రాంచీ మ్యాచ్‌లో పవర్‌ప్లే తర్వాత భారత్‌కు వికెట్ అందించిన ఏకైక బౌలర్ కుల్దీప్ యాదవ్ మాత్రమే. ఈ మ్యాచ్‌లోనూ మిడిల్ ఓవర్లలో విండీస్ మిడిలార్డర్‌ను అడ్డుకోవడానికి అతని బౌలింగే భారత్‌కు కీలకం కానుంది. రాంచీలో ఓటమి ఎదురైనప్పటికీ భారత్ ముగ్గురు స్పెషలిస్ట్ బౌలర్ల విధానాన్ని మార్చే అవకాశం కనిపించడం లేదు. అయితే బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ రాణించలేకపోయిన శివం దూబే స్థానంలో నితీశ్ రెడ్డికి అవకాశం కల్పించే ఆలోచనలో మేనేజ్మెంట్ ఉంది.
జోష్‌లో విండీస్
తొలి పోరులో తేలిపోయిన తర్వాత రాంచీలో అద్భుత విజయం అందుకున్న విండీస్ జోష్‌లో ఉంది. కరీబియన్ హిట్టర్లు ఫామ్‌లోకి వస్తే వారి ముందు ఎంత పెద్ద లక్ష్యం ఉంచినా కాపాడుకోవడం కష్టమే అని భారత్‌కు తెలిసింది. వన్డే సిరీస్ నుంచి అదరగొడుతున్న విండీస్ కెప్టెన్ షై హోప్ సూపర్ ఫామ్ ఆ జట్టుకు కొండంత బలం కాగా.. రాంచీలో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన రూథర్‌ఫర్డ్ అతనికి తోడయ్యాడు. దాంతో విండీస్ బ్యాటింగ్ విభాగం మరింత పదునెక్కింది. బౌలింగ్‌లో రోస్టన్ ఛేజ్ ఆ జట్టుకు అత్యంత కీలకం. రాంచీలో మిడిల్ ఓవర్లలో అతను వరుస వికెట్లు పడగొట్టడం భారత లయను దెబ్బతీసిందని హెడ్ కోచ్ గంభీర్ చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో హోప్, రూథర్‌ఫర్డ్‌ను అడ్డుకునే మార్గాలను ఆతిథ్య బౌలర్లు కనుగొనాల్సిందే. అదే సమయంలో బ్యాటర్లు.. ఛేజ్‌ను పక్కాగా ఎదుర్కుంటేనే భారత్ నుంచి విజయం ఆశించొచ్చు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

