One Hand Spanish Footballer : అతడికి పుట్టుకతోనే కుడి చేయి లేదు. అయినా బాధపడుతూ కూర్చోలేదు. ఫుట్‌బాలర్(Footballer) అవ్వాలని కలలు కన్నాడు. అతడి పట్టుదల ముందు విధిరాత చిన్నబోయింది. అతడి సంకల్ప బలం ముందు వైకల్యం ఓడిపోయింది. ఉన్న ఒక్క చెయ్యితోనే శరీరాన్ని సమన్వయం చేసుకుంటూ నచ్చిన ఆటలో రాణిస్తూ అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. అతడి పేరు.. అలెక్స్ సాంచెజ్(Alex Sanchez). స్పెయిన్‌కు చెందిన ఈ ఫార్వార్డ్ ఆటగాడు(Farward Player) భారత గడ్డపై తొలి మ్యాచ్ ఆడాడు.
డ్యురాండ్ కప్(Durand Cup 2023)లో గోకులం కేరళ(Gokulam Kerala) జట్టు తరఫున అలెక్స్ బరిలోకి దిగాడు. దాంతో, భారత గడ్డపై ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన ఒంటి చేతి ఆటగాడిగా అలెక్స్ గా గుర్తింపు సాధించాడు. ఎయిర్ ఫోర్లు ఎఫ్టీ(Air Force FT)తో జరిగిన మ్యాచ్‌లో అలెక్స్ తన అద్భుత టెక్నిక్‌తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గోకులం కేరళ 2-0తో గెలుపొందింది.
Snaps from Gokulam Kerala FC’s 2-0 win at the Kishore Bharati Kirangan, Kolkata against Indian Air Force FT.#IndianOilDurandCup #132ndEditionofDurandCup #DurandCupPoweredByCoalIndiaLtd #IndianFootball #IndianFootballForwardTogether #ManyChampionsOneLegacy #GKFCIAFFT pic.twitter.com/KdVN0YtAfv
— Durand Cup (@thedurandcup) August 9, 2023
ఈ ఏడాది ఆరంభంలో గోకులం కేరళ జట్టు అలెక్స్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ స్పెయిర్ స్టార్ 2009లో మొదటిసారి లా లిగ(La Liga) క్లబ్ తరఫున ఆడాడు. దాంతో, మొదటి ఫుట్‌బాలర్‌గా రికార్డు సృష్టించాడు. 34 ఏళ్ల అలెక్స్ ఇప్పటి వరకూ రియల్ జరగోజ, సీడీ తుడెలానో, సీఏ ఒసాసునే, ఉటెబొ ఫుట్‌బాల్ క్లబ్ వంటి జట్లకు ఆడాడు.