Shikhar Dhawan | నా పేరు లేకపోవడంతో షాకయ్యా.. అవకాశం వస్తే నిరూపించుకుంటా : ధావన్
Shikhar Dhawan : వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) మళ్లీ భారత జట్టు తరఫున ఆడడం ఇక కష్టమే. ఎందుకంటే..? ఆసియా గేమ్స్(Asia Games 2023) జట్టుకు పూర్తిగా యంగ్‌స్టర్స్‌ను సెలక్ట్ చేయడంతో అతడికి దారులు దాదాపు మూసుకుపోయాయి. ఈ వ్యవహారంపై గబ్బర్ తొలిసారి పెదవి విప్పాడు. ఆసియా గేమ్స్ జట్టుకు తనను ఎంపిక చేయకపోవడం ఎంతో బాధించిందని...
Shikhar Dhawan : వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) మళ్లీ భారత జట్టు తరఫున ఆడడం ఇక కష్టమే. ఎందుకంటే..? ఆసియా గేమ్స్(Asia Games 2023) జట్టుకు పూర్తిగా యంగ్‌స్టర్స్‌ను సెలక్ట్ చేయడంతో అతడికి దారులు దాదాపు మూసుకుపోయాయి. అయితే.. ఈ టోర్నీలో ఆడే టీమిండియాకు ధావన్నే కెప్టెన్‌గా చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad)కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఈ వ్యవహారంపై గబ్బర్ తొలిసారి పెదవి విప్పాడు. ఆసియా గేమ్స్ జట్టుకు తనను ఎంపిక చేయకపోవడం ఎంతో బాధించిందని అన్నాడు.
‘ఆసియా గేమ్స్‌కు వెళ్లే భారత బృందంలో నా పేరు లేకపోవడంతో షాకయ్యా. అయితే.. సెలెక్టర్లు భిన్నమైన ఆలోచనతో ఉన్నారని అనుకున్నా. ఏది ఏమైనా వాళ్ల నిర్ణయాన్ని గౌరవించాల్సిందే. రుతురాజ్ కెప్టెన్‌గా ఉన్నందుకు సంతోషంగా ఉంది. యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తారని ఆశిస్తున్నా’ అని ధావన్ వెల్లడించాడు. ఈ ఏడాది సెప్టెంబర్ – అక్టోబర్ మధ్య చైనాలోని హంగ్జౌ(Hangzhou)లో ఆసియా గేమ్స్ జరుగనున్నాయి. మరో విషయం ఏంటంటే..? భారత జట్టును బీసీసీఐ తొలిసారిగా ఈ పోటీలకు పంపిస్తోంది.
శిఖర్ ధావన్

గిల్ దూసుకు రావడంతో…
రోహిత్ శర్మకు జోడీగా ధావన్ ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే.. శుభ్‌మన్ గిల్(Shubman Gill) దూసుకు రావడంతో అతడు తప్పుకోవాల్సి వచ్చింది. స్వదేశంలో శ్రీలకం, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లలో గిల్, రోహిత్ ద్వయం బాగా హిట్ అయింది. దాంతో, ఇక ధావన్ అవసరం లేకపోయింది. ఈ ఏడాది సొంత గడ్డపై వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న బీసీసీఐ అందుకు తగ్గట్టే జట్టును ఎంపిక చేయనుంది.
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్

ఓపెనర్‌గా రోహిత్‌తో పాటు గిల్, ఇషాన్ కిషన్(Ishan Kishan), యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) రూపంలో చాలా ఆప్షన్లు ఉన్నాయి. దాంతో, ప్రపంచ కప్(ODI World Cup 2023) జట్టులోనూ ధావన్ ఉండే అవకాశం లేదు. అయితే.. ఈ లెఫ్ట్ హ్యాండర్ మాత్రం ఏదో ఒకరోజు చాన్స్ రాకపోతుందా? అనే నమ్మకంతో ఉన్నాడు. ‘ఒక్క శాతం లేదా 20 శాతం అవకాశమున్నా సరే నేను సిద్ధంగా ఉన్నా. అందుకనే ఫిట్నెస్ కాపాడుకుంటున్నా’ అని ధావన్ అంటున్నాడు.
ఇవి కూడా చదవండి
Cricketers – NADA TEST | డోపింగ్ టెస్టులో జడ్డూ టాప్.. ఆ ఇద్దరిపై ఎందుకు చేయలేందంటే..?
The Hundred League 2023 | ది హండ్రెడ్ లీగ్‌లో సంచలనం.. 20 బంతుల్లో ఏకంగా 19 డాట్ బాల్స్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

