Suryakumar Yadav | ప్రచండ సూర్య మరో రికార్డు.. వంద సిక్స్‌ల క్లబ్లో టీ20 స్టార్
Suryakumar Yadav : పొట్టి క్రికెట్ సంచలనం సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) మరో రికార్డు సృష్టించాడు. ఈ విధ్వంసక ఆటగాడు వంద సిక్స్(100 Six Club)ల క్లబ్లో చేరాడు. మరో టీమిండియా ప్లేయర్ కేఎల్ రాహుల్ (99 సిక్స్‌లు)ను సూర్య దాటేశాడు. ఈ ఫార్మాట్లో సెంచరీ మార్క్ దాటిన మూడో భారత...
Suryakumar Yadav : పొట్టి క్రికెట్ సంచలనం సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) మరో రికార్డు సృష్టించాడు. ఈ విధ్వంసక ఆటగాడు వంద సిక్స్(100 Six Club)ల క్లబ్లో చేరాడు. మరో టీమిండియా ప్లేయర్ కేఎల్ రాహుల్ (99 సిక్స్‌లు)ను సూర్య దాటేశాడు. ఈ ఫార్మాట్లో సెంచరీ మార్క్ దాటిన మూడో భారత క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. వెస్టిండీస్(West Indies)తో జరిగిన మూడో టీ20లో 4 సిక్స్‌లు బాదిన సూర్య ఈ మైలురాయికి చేరువయ్యాడు. అతడి ఖాతాలో ప్రస్తుతం 101 సిక్స్‌లు ఉన్నాయి.
ఇక ఈ జాబితాలో రోహిత్ శర్మ(Rohit Sharma) 182 సిక్స్‌లతో అందరికంటే ముందున్నాడు. 117 సిక్స్‌లతో విరాట్ కోహ్లీ(Virat Kohli) రెండో స్థానంలో నిలిచాడు. వెటరన్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) 74 సిక్స్‌లతో నాలుగో స్థానం సంపాదించుకున్నాడు.
Suryakumar Yadav joins an exclusive list of India players with 100 sixes in men’s T20Is 🙌
More: https://t.co/Q0zbMGkoTe pic.twitter.com/9DGW8ixP0O
— ICC (@ICC) August 10, 2023
ఐపీఎల్(IPL)లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) తరఫున తుఫాన్ ఇన్నింగ్స్‌లు ఆడిన సూర్య ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. ‘మిస్టర్ 360 ప్లేయర్’గా పేరొందిన సూర్య 30 ఏళ్ల వయసులో భారత జట్టులోకి వచ్చాడు. లేటు వయసులో ఎంట్రీ ఇచ్చినా సంచలన ఆటతో తన ముద్ర వేశాడు. నిరుడు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చిన టీ20 వరల్డ్ కప్‌లో ఈ చిచ్చరపిడుగు విశ్వరూపం చూపించాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ సిరీస్‌లో సెంచరీతో కదం తొక్కాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్య

అయితే.. వన్డేల్లో మాత్రం అంతగా రాణించలేకపోతున్నాడు. ఈ ఏడాది స్వదేశంలో ప్రపంచ కప్(ODI World Cup 2023)లో సూర్యలాంటి హిట్టర్ ఉండడం భారత్‌కు ఎంతో లాభిస్తుంది. కానీ, అతను మాతం 50 ఓవర్ల ఆటలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. తాజాగా విండీస్ పర్యటనలోనూ తేలిపోయాడు. అదేంటో గానీ.. టీ20ల్లో మాత్రం పూనకం వచ్చినట్లు చెలరేగుతున్నాడు. రెండు మ్యాచుల్లో విఫలమైన అతను మూడో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా ఆడాడు. కీలక సమయంలో ఫామ్‌లోకి వచ్చిన సూర్య జట్టును గెలిపించాడు. ధనాధన్ ఆటతో 44 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌లతో 83 రన్స్ కొట్టి సిరీస్ చేజారకుండా చూశాడు.
ఇవి కూడా చదవండి
Shikhar Dhawan | నా పేరు లేకపోవడంతో షాకయ్యా.. అవకాశం వస్తే నిరూపించుకుంటా : ధావన్
Cricketers – NADA TEST | డోపింగ్ టెస్టులో జడ్డూ టాప్.. ఆ ఇద్దరిపై ఎందుకు చేయలేందంటే..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

