పెండ్లి దుస్తుల్లో పరీక్షా కేంద్రానికి వచ్చిన నవవధువు!
ఫైనల్ ఎగ్జామ్స్ రాసేందుకు నవ వధువు పెండ్లి దుస్తులతోనే కాలేజీకి వెళ్లిన ఘటన యూపీలోని కుషాహ్రలో వెలుగుచూసింది. డిగ్రీ మూడవ సంవత్సరం సోషియాలజీ పరీక్ష రాసేందుకు జుదావతి వైష్ వివాహమైన వెంటనే శ్రీ ప్రమోద్ జీ మహిళా మహావిద్యాలయకు పెండ్లి దుస్తుల్లోనే వెళ్లింది.
లక్నో : ఫైనల్ ఎగ్జామ్స్ రాసేందుకు నవ వధువు పెండ్లి దుస్తులతోనే కాలేజీకి వెళ్లిన ఘటన యూపీలోని కుషాహ్రలో వెలుగుచూసింది. డిగ్రీ మూడవ సంవత్సరం సోషియాలజీ పరీక్ష రాసేందుకు జుదావతి వైష్ వివాహమైన వెంటనే శ్రీ ప్రమోద్ జీ మహిళా మహావిద్యాలయకు పెండ్లి దుస్తుల్లోనే వెళ్లింది.
మే 27న పెండ్లి మంటపం నుంచే ఆమె నేరుగా బీఏ పరీక్ష రాసేందుకు కాలేజ్‌కు చేరుకుంది. ఆమెకు అంతకుముందు రోజు రాత్రి వివాహం జరిగింది. పెండ్లి కావడంతోనే ఏడాది పాటు తాను పడిన కష్టాన్ని వృధా కాకూడదని తమ కూతురు నిర్ణయం తీసుకుందని ఆమె తండ్రి చెప్పారు.
తాను పరీక్షకు హాజరవుతానని పెండ్లి కొడుకుతో చెప్పగా ఆమె నిర్ణయానికి అతడి కుటుంబ సభ్యులు అంగీకరించారు. జుదావతి వైష్ పరీక్షా కేంద్రం నుంచి తిరిగిరాగానే పెండ్లి తంతులో మిగిలిన కార్యక్రమాలు చేపడతామని పెండ్లికొడుకు తల్లితండ్రులు తెలిపారు. పరీక్ష హాలులో పెండ్లి బట్టలతో జుదావతి కనిపించడంతో ఆమె టీచర్లు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
- Tags
- appear
- bride
- college exam
- UP
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

