న్యూఢిల్లీ : తాజ్‌మహల్‌ను దర్శించిన అనంతరం ఓ మెక్సికన్ జంట హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా ఆగ్రాలో వివాహ బంధంతో ఒక్కటైంది. తాజ్ నగరిలోని శివాలయంలో వారు వివాహం చేసుకున్నారు. వివాహానికి వీరి స్ధానిక స్నేహితులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.వివాహానంతరం స్దానిక టూర్ ఆపరేటర్లు, గైడ్లు, డ్రైవర్లు, వారికి ఆశ్రయం ఇచ్చిన హోటళ్ల సిబ్బంది అంతా కలిసి భోజనం చేశారు.
స్ధానిక హోటల్ యజమాని గౌరవ్ గుప్తా విదేశీ జంట వివాహాన్ని దగ్గరుండి జరిపించారు. తాజ్ మహల్‌ను చూసిన అనంతరం క్లౌదియా, సెరమికో హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కటవడం స్ధానికులకు ఆశ్చర్యం కలిగించింది. వివాహానంతరం క్లౌదియా మాట్లాడుతూ తాజ్ మహల్‌కు సంబంధించిన కధ విన్నత ర్వాత తాము షాజహాన్, ముంతాజ్‌ల ప్రణయ కధతో ఇన్స్పైర్ అయ్యామని తమ ప్రేమను ఎప్పటికీ మధురైమన జ్హాపకంగా మలుచుకోవాలనుకున్నామని చెప్పారు.
ఆపై భారత్‌ను సందర్శించి హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామన అన్నారు. ప్రేమకు చిహ్నమైన నగరం ఆగ్రాలోనే తాము వివాహం చేసుకోవాలనుకున్నామని తెలిపారు. సూర్యోదయాన్ని తాజ్‌మహల్ వద్ద వీక్షించి ఆపై మధ్యాహ్నం వివాహ బంధంతో ఒక్కటయ్యామని చెప్పారు. వెడ్డింగ్ డిన్నర్‌కు వచ్చిన గ్రూపు సభ్యులు, ఆహ్వానితులతో కలిసి కొత్త జంట రెస్టారెంట్లో నృత్యం చేయడం అందరినీ ఆకర్షించింది.