భోపాల్: ప్రపంచంతోపాటు దేశంలో బాగా పాపులర్ అయిన పులి ‘కాలర్‌వాలి’ వృద్ధాప్యంతో మరణించింది. దీంతో అటవీ సిబ్బంది ఘనంగా నివాళి అర్పించి అంత్యక్రియలు నిర్వహించారు. మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్‌కు చెందిన పులి టీ15ను ‘కాలర్‌వాలి’గా పిలుస్తారు. ఈ లెజెండరీ పులి 15 ఏండ్ల కంటే ఎక్కువగా జీవించింది. ఎనిమిది కాన్పుల్లో 29 పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో ‘సూపర్ మామ్స్’ అనే బిరుదును దక్కించుకుంది. 29 పిల్లల్లో 25 వరకు బతికి పెద్దవయ్యాయి.
మాతరం అని కూడా పిలిచే ఈ ఆడపులి చివరిగా జనవరి 14న సీతాఘాట్ ప్రాంతంలో పర్యాటకుల కంటపడింది. వృద్ధాప్యం వల్ల నేలమీద పడి ఉన్న దానిని గుర్తించారు. కాగా, ఆ పులి శనివారం సాయంత్రం 6:15 గంటలకు టైగర్ రిజర్వ్‌లోని కర్మఝిరి ప్రాంతంలో మరణించిందని అటవీ శాఖ అధికారి అధర్ గుప్తా తెలిపారు. లెజెండరీ పులి ‘కాలర్‌వాలి’కి ఘనంగా నివాళి అర్పించి అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు.
మరోవైపు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్ ద్వారా ఈ పులికి నివాళి అర్పించారు. కాగా, ఈ పులితో తనకు ఉన్న అనుబంధాన్ని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ వరుణ్ ఠక్కర్ గుర్తు చేసుకున్నారు. “నాకు కాలర్వాలీతో అంతులేని జ్ఞాపకాలు ఉన్నాయి. 2006-07 నుండి దానిని, దాని పిల్లలను ఫోటో తీయడం నా అదృష్టం. పెంచ్‌కు ఇది ముగింపు. కాలర్‌వాలి సంతానం పులుల జనాభాను బాగా పెంచింది. నంబర్ వన్ టైగర్ రిజర్వ్‌గా చేసింది. ఆ పులి మరణం వ్యక్తిగత లోటు” అని పేర్కొన్నారు.
मप्र को टाइगर स्टेट का दर्जा दिलाने में महत्वपूर्ण भूमिका निभाने वाली, मध्यप्रदेश की शान व 29 शावकों की माता @PenchMP की ‘सुपर टाइग्रेस मॉम’ कॉलरवाली बाघिन को श्रद्धांजलि।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) January 16, 2022
पेंच टाइगर रिजर्व की 'रानी' के शावकों की दहाड़ से मध्यप्रदेश के जंगल सदैव गुंजायमान रहेंगे। pic.twitter.com/nbeixTnnWv
विश्व में पहचान दिलाने वाली मादा बाघ 'टी 15' ने 29 शावकों को जन्म दिया और @PenchMP में बाघों का कुनबा बढ़ाने में अपना अविस्मरणीय योगदान दिया। ऐसी #SuperTigeressMom #कॉलरवाली_बाघिन को पूरे प्रदेशवासियों की ओर से सुपर सैल्यूट।#collarwali @WWFINDIA @WWF_tigers @mptfs #JansamparkMP pic.twitter.com/ytNv1SmD0o
— Department of Forest, MP (@minforestmp) January 17, 2022