అగ్నిపర్వతం బద్దలవడంతో ఏరులై పారిన లావా స్పెయిన్ ఐలండ్ లా పల్మా దీవిని ముంచెత్తింది. లావా ఉవ్వెత్తున ఉప్పొంగడంతో ఆదివారం పల్మా దీవి చివురుటాకులా వణికింది. ఈ ఉత్పాతంతో భీతిల్లిన వేలాది మంది ఆ ప్రాంతాన్ని విడిచివెళ్లారు. కుంబ్రే విజా వాల్కనోలో ఏర్పడిన పగుళ్ల నుంచి లావా పల్మా దీవిని ముంచెత్తింది. రాయటర్స్ వెల్లడించిన డ్రోన్ ఫుటేజ్‌లో పల్మా అగ్నిపర్వతం నుంచి లావా స్విమ్మింగ్ పూల్‌ను ముంచుతూ తీర ప్రాంతంలోని పలు ఇండ్లను ధ్వంసం చేయడం కనిపించింది.
Drone footage showed lava from Spanish Canary Islands’ La Palma volcano swallowing a swimming pool and houses on its way to the coast https://t.co/sIO1gcoOzO pic.twitter.com/gB3duLGVuQ
— Reuters (@Reuters) September 21, 2021
స్పానిష్ అగ్నిమాపక సిబ్బంది ట్విట్టర్లో షేర్ చేసిన మరో ఫుటేజ్ సైతం లావా వ్యర్ధాలు నెమ్మదిగా పట్టణాన్ని ముంచెత్తిన తీరును కండ్లకు కట్టింది. “ప్రకృతి కన్నెర్ర చేస్తే మనం చేయగలిగిందేమీ ఉండద”ని ఈ వీడియోను షేర్ చేస్తూ ఫైర్ ఫైటర్ క్యాప్షన్ జత చేశారు. లావా బీభత్సంతో ఆదివారం నుంచి 5500 మందికి పైగా ప్రజలను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. స్పానిష్ ఐలండ్‌లో ఈ తరహా విధ్వంసం 1971 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.
LIVE: Lava from volcano destroys homes on Spain's La Palma island https://t.co/YEDnJUzwN6
— Reuters (@Reuters) September 20, 2021