హాంకాంగ్‌లోని ఐకానిక్ జంబో ఫ్లోటింగ్ రెస్టారెంట్ నిధుల లేమితో మూతపడింది. గత రెండేండ్లుగా అమలైన కరోనా నియంత్రణలతో నీటిలో తేలియాడే రెస్టారెంట్ నష్టాల బాట పట్టింది.
హాంకాంగ్ అధికారులు ఈ ఐకానిక్ రెస్టారెంట్‌ను కాపాడేందుకు ముందుకు రాకపోవడంతో ఫ్లోటింగ్ రెస్టారెంట్‌ను కష్టాలు వెంటాడాయి.హాంకాంగ్ ఐకానిక్ రెస్టారెంట్‌ను ఆదుకోవాలని చట్టసభ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
గతంలో ఈ రెస్టారెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు సందర్శించారు. 1950ల్లో నిర్మించిన నీటిలో తేలియాడే ఈ రెస్టారెంట్‌ను ఇంపీరియల్ స్టైల్లో అలంకరించడంతో ప్రపంచ దేశాల సందర్శకులను, సెలబ్రిటీలను ఆకట్టుకుంది.