e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home News Teachers Day : సచిన్‌, బిల్‌గేట్స్‌ విజయం వెనుక ఉన్నది ఈ గురువులే.. వాళ్లెవరంటే

Teachers Day : సచిన్‌, బిల్‌గేట్స్‌ విజయం వెనుక ఉన్నది ఈ గురువులే.. వాళ్లెవరంటే

పిల్ల‌ల‌ను క‌న్న‌వాళ్లు కాదు.. వాళ్ల‌ను తీర్చిదిద్దిన‌వాళ్ల‌ను మ‌నం ఎక్కువ గౌర‌వం ఇవ్వాలి.. అని అన్నారు అరిస్టాటిల్‌. ఆయ‌న చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం. ఎందుకంటే.. పిల్ల‌ల‌కు చ‌దువు సంధ్య‌లు నేర్పించ‌డంతో పాటు.. క్ర‌మశిక్ష‌ణ‌.. పెద్ద‌వాళ్ల‌తో ఎలా మెల‌గాలి.. లాంటి చాలా విష‌యాల‌ను ఉపాధ్యాయులే నేర్పిస్తారు. ఉపాధ్యాయులే వాళ్ల భ‌విష్య‌త్తుకు బాట‌లు వేస్తారు. అందుకే.. భ‌విష్య‌త్తు త‌రాల‌ను దేశ అభివృద్ది కోసం తీర్చిదిద్దే ఉపాధ్యాయుల‌ను ప్ర‌తి సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ 5న దేశ‌మంతా స్మ‌రించుకుంటుంది.

అయితే.. మ‌న దేశంలోనే కాదు.. ప్ర‌పంచం మొత్తం మీద గొప్ప విజ‌యాల‌ను సాధించిన వాళ్లు.. ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించిన వాళ్లు.. త‌మ గురువుల‌ను ఆద‌ర్శంగా తీసుకున్న‌వాళ్లే. ఎంద‌రో మ‌హానుభావులు.. త‌మ గురువులు చూపించిన బాట‌లో న‌డిచి.. దేశానికే ఆద‌ర్శంగా నిలిచారు. ఫేమ‌స్ వ్య‌క్తుల‌య్యారు. వాళ్ల‌లో కొంద‌రి గురించి టీచ‌ర్స్ డే రోజు సంద‌ర్భంగా తెలుసుకుందాం రండి.

Sachin Tendulkar

- Advertisement -

మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండుల్క‌ర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకునేది ఏం లేదు. ఆయ‌న క్రికెట్ కోచ్ ర‌మాకాంత్ అచ్రేక‌ర్ ప్ర‌భావం మాత్రం త‌న మీద ఎక్కువ‌గా ఉండేద‌ని చాలాసార్లు స‌చిన్ చెప్పారు. త‌న క్రికెట్ జ‌ర్నీలో ర‌మాకాంత్ అచ్రేక‌ర్ పాత్ర అమోఘ‌మైంది. ప్ర‌స్తుతం స‌చిన్ టెండుల్క‌ర్.. భార‌త‌దేశం గ‌ర్వించే స్థాయి క్రికెట‌ర్ అయ్యారంటే దానికి కార‌ణం.. ర‌మాకాంత్ అనే చెప్పాలి. ర‌మాకాంత్‌.. స‌చిన్‌కు ముంబైలోని దాద‌ర్‌లో ఉన్న శివాజీ పార్క్‌లో క్రికెట్ ట్రెయినింగ్ ఇచ్చేవారు.

Bill Gates

బిల్ గేట్స్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ప్ర‌స్తుతం ఎక్కువ శాతం మంది ఉప‌యోగిస్తున్న విండోస్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను త‌యారు చేసింది.. బిల్ గేట్స్ కంపెనీ మైక్రోసాఫ్టే. ఆయ‌న ప్ర‌పంచంలోనే మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ ప‌ర్స‌న్. ఆయ‌న హార్వార్డ్ యూనివ‌ర్సిటీలో డ్రాప్ ఔట్‌. అయిన‌ప్ప‌టికీ.. త‌న మ్యాథ్స్‌, డ్రామా టీచ‌ర్ల ప్ర‌భావం త‌న మీద చాలా ఉంద‌ట‌. అలాగే.. త‌న స్కూల్‌లో లైబ్రేరియ‌న్, టీచ‌ర్ అయిన కెఫియెరే ప్ర‌భావం త‌న మీద ఎక్కువ‌గా ఉండేది.. అని ఓ బ్లాగ్‌లో వెల్ల‌డించారు బిల్ గేట్స్‌.

Dr Maya Angelou

మాయా అంగెలో.. అమెరికాకు చెందిన క‌వ‌యిత్రి, ర‌చ‌యిత్రి. త‌ను పౌర హ‌క్కుల యాక్టివిస్ట్ కూడా. ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌న క‌విత్వాల‌కు మంచి గుర్తింపు ల‌భించింది. దానికి కార‌ణం.. త‌న టీచ‌ర్ బెర్తా. ఆ టీచ‌ర్ ప్ర‌భావం త‌న మీద చాలా ఉంద‌ట‌. ఎక్కువగా పుస్త‌కాలు చ‌ద‌వాల‌ని మాయాను ఆ టీచ‌రే ఎంక‌రేజ్ చేసేద‌ట‌. అలాగే.. స్కూల్‌లో క‌విత్వాల‌ను గ‌ట్టిగా బ‌య‌ట‌కు చ‌ద‌వాల‌ని చెప్పేద‌ట‌. అలా.. మాయ‌కు క‌విత్వం మీద మ‌క్కువ ఏర్ప‌డి.. అదే రంగంలో రాణించేలా చేసింద‌ట‌.

లోక‌ల్‌ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి 

Bird Photographer of the Year 2021 : ప‌క్షుల ఫోటోగ్ర‌ఫీ.. అవార్డ్స్‌ గెలుచుకున్న ఈ ఫోటోల‌ను చూసి ఫిదా కావాల్సిందే..!

Costly Cottage : ఏమీ లేని ఈ కాటేజ్‌కు రూ.5.5 కోట్లు.. ఎందుకో తెలుసా..?

bullettu bandi | బుల్లెట్టు బండి పాట పాడింది మోహ‌న‌.. మ‌రి రాసింది ఎవ‌రో తెలుసా?

Prawn Biryani | హైద‌రాబాదీ బిర్యానీల్లో న‌యా ట్రెండ్‌ రొయ్య‌ల బిర్యానీ.. ఆరోగ్యానికి ఎంత మంచిదంటే..


Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement