సాధారణంగా పెంపుడు కుక్క, పిల్లికి పుట్టిన రోజు వేడుకలు చేయడం చూస్తుంటాం. తాజాగా ఈ లిస్ట్‌లో కోడి కూడా చేరింది. ఒక పెంపుడు కోడి పుంజుకు రెండో పుట్టిన రోజును దాని కుటుంబ సభ్యులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఒక యువతి చేతిలోని కోడి కాళ్లతో పెద్ద కేక్‌ను కూడా కట్ చేయించారు. చిన్న కేక్ ముక్కను దానికి తినిపించారు. దీంతో అక్కడ ఉన్న వారంతా హ్యాపీ బర్త్ డే సాంగ్ పాడారు. అనంతరం అంతా కోడి బర్త్ డేని ఎంజాయ్ చేశారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కోడికి బర్త్ డే వేడుక జరుపడాన్ని కొందరు నెటిజన్లు స్వాగతించారు. అయితే చాలా మంది ఆ కోడిపై పలు రకాలుగా జోకులు వేస్తూ కామెంట్లు చేశారు.