Aadhar card | మీ ఆధార్‌ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
మీ ఆధార్‌ను ఎవరైనా వాడారా | వరైనా మన ఆధార్ డేటాను దుర్వినియోగం చేస్తేనే డేంజర్. అందుకే ఆ వివరాలు సరైన చోటనే ఇచ్చామా? ఎవరైనా మన ఆధార్ డేటాను ఎవరైనా దుర్వినియోగం చేశారా? అనే సందేహం చాలామందికే వచ్చే ఉంటుంది.

check where your aadhaar has been used | చాలా చోట్ల ఇప్పుడు ఆధార్ అవసరమైపోయింది. దీంతో అడిగిన ప్రతి చోట మన ఆధార్ వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. నమ్మకమైన చోట ఆధార్ వివరాలు ఇస్తే ఫర్వాలేదు.. కానీ ఎవరైనా మన ఆధార్ డేటాను దుర్వినియోగం చేస్తేనే డేంజర్. అందుకే ఆ వివరాలు సరైన చోటనే ఇచ్చామా? ఎవరైనా మన ఆధార్ డేటాను ఎవరైనా దుర్వినియోగం చేశారా? అనే సందేహం చాలామందికే వచ్చే ఉంటుంది. అందుకే మన ఆధార్‌ను ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు ఉపయోగించారో తెలుసుకునే సదుపాయాన్ని యూఐడీఏఐ అందిస్తోంది. గత ఆరు నెలల కాలంలో ఆధార్‌ను ఎందుకు ఉపయోగించారో యూఐడీఏఐ వెబ్సైట్ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు..
– మన ఆధార్ డేటా ఎక్కడ వాడారో తెలుసుకోవాలంటే ముందుగా మీ మొబైల్ నంబర్ ఆధార్ కార్డుతో అనుసంధానమై ఉండాలి. అప్పుడే ఆ వివరాలు తెలుసుకోవడం సాధ్యమవుతుంది.
– ముందుగా మీ బ్రౌజర్లో యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ (https://uidai.gov.in/) ఓపెన్ చేయాలి
– యూఐడీఏఐ వెబ్సైట్ ఓపెన్ అయ్యాక ‘మై ఆధార్’ సెక్షన్‌లోని ‘ఆధార్ సర్వీసెస్’లో ఉన్న ‘Aadhaar Authentication History’పై క్లిక్ చేయాలి.
– అప్పుడు కొత్త పేజి ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ నంబర్ సెలెక్ట్ చేసుకోవాలి.
– ఆధార్ నంబర్ ఎంటర్ చేశాక క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత Send OTPపై క్లిక్ చేయాలి.
– అప్పుడు కొత్త పేజి ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఏ లావాదేవీ చూడాలని అనుకుంటున్నారు.. ఎంత వ్యవధిలోని లావాదేవీల వివరాలు కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం మన మొబైల్‌కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి.. వెరిఫై బటన్‌పై క్లిక్ చేయాలి.
– అప్పుడు కొత్త పేజీలో మన ఆధార్‌ను ఏ సమయంలో, ఎక్కడ ఉపయోగించారన్న వివరాలు కనిపిస్తాయి. ఆ వివరాలను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది.
– ఇలా ఎప్పటికప్పుడు ఆధార్ వివరాలు ఎక్కడ ఉపయోగించారో చూడటం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
క్రెడిట్ కార్డు సైజ్‌లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..
ఆధార్ నంబర్ మర్చిపోయారా? ఇలా తెలుసుకోండి
Adhar card | పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు ఎలా మార్చాలి?
ఆధార్ నంబర్ మర్చిపోయారా ? ఇలా తెలుసుకోండి
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

