Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Instamart Surprises Madurai Influencer Veeramani | మధురైకి చెందిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ వీరమణి ఇటీవల ఫేక్ క్యాష్-ఆన్-డెలివరీ (COD) ఆర్డర్ల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Instamart Surprises Madurai Influencer Veeramani | మధురైకి చెందిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ వీరమణి ఇటీవల ఫేక్ క్యాష్-ఆన్-డెలివరీ (COD) ఆర్డర్ల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీపావళికి ఎవరైనా తనకు బాక్సు నిండా స్వీట్లు పంపాలని కోరుతూ ఆయన తన అడ్రస్, ఫోన్ నెంబర్ షేర్ చేయగా, ఆకతాయిలు ఆయనకు తెలియకుండానే లక్షల విలువైన ఎలక్ట్రానిక్స్, ఫ్రిజ్‌లు, టీవీలు మరియు ఇతర వస్తువులతో వందలాది ఫేక్ ఆర్డర్లు పెట్టారు. దీంతో ఆయన ఆ డబ్బులు కట్టలేక, డెలివరీ బాయ్స్ ఒత్తిడి భరించలేక ఇల్లు వదిలి వెళ్లాల్సి వచ్చింది.
అయితే, ఈ ఘటనపై స్పందించిన ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్’ (Swiggy Instamart) ఈ నెగెటివ్ పరిస్థితికి ఒక చక్కని ముగింపునిచ్చింది. తమ ‘క్విక్ ఇండియా మూవ్మెంట్ సేల్’ (Quick India Movement Sale) ప్రచారంలో భాగంగా వీరమణి కోరుకున్న విధంగా బాక్సు నిండా స్వీట్లతో పాటు, స్పీకర్, మానిటర్, స్టవ్, మిక్సర్ వంటి పలు ఉపయోగకరమైన గాడ్జెట్లు మరియు గిఫ్ట్‌లను ఎలాంటి డబ్బులు కోరకుండా పూర్తిగా ఉచితంగా (Prepaid Gifts) ఆయనకు డెలివరీ చేసి సర్ప్రైజ్ చేసింది. గతంలో ఫేక్ ఆర్డర్లతో వేదనకు గురైన వీరమణికి ఇన్‌స్టామార్ట్ అందించిన ఈ అనూహ్య కానుకలు ప్రస్తుతం నెట్టింట హైలైట్‌గా నిలిచాయి.
View this post on Instagram
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

