ఆధార్ నంబర్ మర్చిపోయారా? ఇలా తెలుసుకోండి

ఆధార్ ఇప్పుడు అంతట అవసరమే.. దాంతో ఎప్పుడు ఏ అవసరం పడుతుందో చెప్పలేం. అలా ఎప్పుడైనా ఆధార్‌తో పనిపడ్డప్పుడు జేబులో ఆధార్ కార్డు ఉండకపోవచ్చు. కనీసం ఆధార్ నంబర్ చెబుదామన్నా నంబర్ గుర్తుండదు. ఆ సమయంలో ఏం చేయాలా? అని తెగ టెన్షన్ పడిపోతుంటాం. కానీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ చేతిలో ఒక స్మార్ట్‌ఫోన్, అందులో ఇంటర్నెట్ ఉంటే చాలు.. నిమిషాల్లోనే ఆధార్ నంబర్‌ను తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
– ఆధార్ నంబర్ తెలుసుకోవాలంటే ముందుగా మీ మొబైల్ నంబర్ ఆధార్ కార్డుతో అనుసంధానమై ఉండాలి. అప్పుడే ఆధార్ నంబర్ తెలుసుకోవడం సాధ్యమవుతుంది.
– ముందుగా మీ బ్రౌజర్లో యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ (https://uidai.gov.in/) ఓపెన్ చేయాలి
– యూఐడీఏఐ వెబ్సైట్ ఓపెన్ అయ్యాక ‘మై ఆధార్’ సెక్షన్‌లోని ‘ఆధార్ సర్వీసెస్’లో ఉన్న ‘రిట్రైవ్ లాస్ట్ ఆర్ ఫర్గాటెన్ ఈఐడీ/యూఐడీ’పై క్లిక్ చేయాలి.
– అప్పుడు కొత్త పేజి ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ నంబర్(యూఐడీ) సెలెక్ట్ చేసుకోవాలి.
– ఆ తర్వాత మొబైల్ నంబర్ లేదా ఈ మెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి
– అనంతరం క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, Send OTP పై క్లిక్ చేయాలి
– మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఆరు అంకెల ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్‌పై క్లిక్ చేయాలి.
– లాగిన్‌పై క్లిక్ చేయగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఆధార్ నంబర్ మెసేజ్ వస్తుంది.
– నవీన్ కుమార్ రెడ్డి
ఇవి కూడా చదవండి..
బట్టలు తెల్లగా మెరవాలా? ఇలా ట్రై చేయండి
కంట్లో నీళ్లు రాకుండా ఉల్లిపాయలు కోయడమెలా
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

