తొలి త్రీడీ ప్రింటెడ్ ఇంటిలో అడుగుపెట్టిన జంట

లండన్ : ఇల్లంటే నెలల తరబడి నిర్మాణం జరుపుకుని ఎంతో శ్రమకోర్చి దాన్ని తీర్చిదిద్దుతుంటారు. అయితే యూరప్ లో కేవలం ఐదు రోజుల్లోనే అందుబాటులోకి వచ్చిన తొలి త్రీడీ ప్రింటెడ్ ఇంటిలో డచ్ జంట అడుగుపెట్టింది. ఎలిజ్ లజ్ (70), హ్యారీ డెకర్ (67) జంట ఈ ఇంటిని నెలకు 960 డాలర్లకు అద్దెకు తీసుకున్నారు. ఇందోవెన్ లో సమీప ఫ్యాక్టరీలో ఈ ఇంటిని ప్రింట్ చేసి 94 చదరపు మీటర్లలో అమర్చారు. ఇంటీరియర్స్ ను మెరుగ్గా డిజైన్ చేసిన ఈ ఇల్లు చిన్న కుటుంబానికి అనువుగా ఉండేలా తీర్చిదిద్దారు. గత వారమే ఈ ఇంట్లో ఉండేందుకు ఆమ్సస్టర్డామ్ కు చెందిన జంట డిజిటల్ కీస్ అందుకుంది.
ఈ ఇల్లు బంకర్ లా అనిపించినప్పటికీ నివసించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలను కలిగిఉంది. ఈ ఇంట్లోకి తాము ఎలా అడుగుపెట్టిందీ ఎలిజ్ వివరిస్తున్న తీరు వీడియోలో కనిపించింది. ఆయన తన ఫోన్ ను ట్యాప్ చేయగానే ముందు డోరు తెరుచుకోవడం ఆకట్టుకుంది. ఇక ఈ ఇంటిని పలు కాంక్రీట్ లేయర్లతో 24 ఎలిమెంట్స్ ద్వారా మెషిన్ పై ప్రింట్ చేశారు. కాంక్రీట్ లేయర్లతో నిర్మించిన ఈ ఇల్లు ఇతర నిర్మాణాల మాదిరిగానే పటిష్టంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

