పెండ్లి అంటే ఖరీదైన దుస్తుల్లో మెరిసే కొత్త జంట.. మిరుమిట్లు గొలిపే లైటింగ్..నోరూరించే వంటకాలు..ఆ హంగామానే వేరు. అందరి కండ్లూ నూతన వధూవరులపైనే ఉండటంతో వారు అందరికీ భిన్నంగా మెరిసే దుస్తుల్లో ఆకట్టుకునేలా ముస్తాబవుతుంటారు. ఇందుకు భిన్నంగా ఓ జంట ట్రాక్సూట్స్తో వెడ్డింగ్ రిసెప్షన్‌కు వచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. స్టైల్‌తో పాటు కంఫర్ట్ కూడా ముఖ్యమంటూ అతిధులను సర్ప్రైజ్కు లోనుచేశారు.
కలకాలం గుర్తుండే పెండ్లిలో వీరు ఎంచుకున్న దుస్తులను వెడ్డింగ్ వీడియోగ్రాఫర్ సారా గొంజలెజ్ రికార్డు చేశారు. ట్రాక్సూట్స్లో కొత్త జంట డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఆమె ఇన్‌స్టా రీల్లో షేర్ చేశారు. ఈ వీడియో క్లిప్‌కు రికార్డు వ్యూస్, లైక్స్ దక్కాయి. నవ దంపతులు ఎంచుకున్న వెడ్డింగ్ డ్రెస్‌ను పలువురు నెటిజన్లు మెచ్చుకోగా, మరికొందరు వారి ఎంపికపై పెదవివిరిచారు.