e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, November 30, 2021
Home News Wi-fi Password : వైఫై పాస్‌వర్డ్‌ కావాలా? ఈ లెక్క ముడి విప్పండి..!

Wi-fi Password : వైఫై పాస్‌వర్డ్‌ కావాలా? ఈ లెక్క ముడి విప్పండి..!

వినియోగదారులను ఆకర్శించేందుకు చాలా రెస్టారెంట్లు ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తున్నాయి. టిఫిన్‌ చేసేటప్పుడు, భోజనానికి ఆర్డర్‌ ఇచ్చినప్పుడు టైం పాస్ కోసం చాలా మంది మొబైల్ ఫోన్లకు పనిచెప్తుంటారు. అయితే, కస్టమర్లకు బోర్‌ రాకుండా ఉండేందుకు ఉచితంగా వైఫై (Wi-fi Password) సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. దాంతో కస్టమర్లు ఉచిత వైఫైతో టైం పాస్ చేసేస్తూ.. ఆర్డర్‌ ఆలస్యమైనా కోపగించుకోవడం లేదు. ఉచిత వైఫై అనేది మార్కెటింగ్ వ్యూహం.

వైఫై పాస్‌వర్డ్‌లు చాలా మటుకు ఇంట్లో లేదా పబ్లిక్ ప్రదేశాలలో సాధారణంగా గుర్తుపెట్టుకునేవిగా సింపుల్‌గా ఉంటాయి. కేఫ్‌లు, రెస్టారెంట్‌ల బయట వేచి ఉండటంలో బోర్‌ రాకుండా ఉండేందుకు చాలా రెస్టారెంట్లు ఉచిత వైఫై అందిస్తున్నాయి. అయితే, వాస్తవానికి ఏమీ ఆర్డర్ చేయకుండా ఎంతో మంది ఉచిత ఇంటర్నెట్ సేవను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది రెస్టారెంట్‌ యజమానులు, నిర్వాహకులకు ఇబ్బంది కలిగించే అంశం. అయినప్పటికీ వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకుని వారిని ఏమీ అనకుండా మిన్నకుంటున్నారు.

- Advertisement -

కానీ, శాన్‌ ఆంటోనియాలోని యయ థాయ్‌ కేఫ్ మాత్రం ఉచిత ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యను పరిమితం చేసేందుకు ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన మార్గాన్ని ఎంచుకున్నది. సుదీర్ఘమైన, సంక్లిష్టమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేయడానికి బదులుగా.. గణిత సమీకరణాలుగా ఇస్తున్నది. ఎవరైనా ఉచిత వైఫై ని యాక్సెస్ చేయాలని భావిస్తే, వారు చేయాల్సిందల్లా సమీకరణానికి సరైన సమాధానం కనుగొనడమే. ఈ లెక్కకు సమాధానం దొరికిందో మీకు వైఫై పాస్‌వర్డ్‌ కూడా దొరుకుతుందన్నమాట. ఈ పాస్‌వర్డ్‌ చమత్కార ఆలోచన 2016 నుంచి ప్రారంభమైందంట. ఈ కేఫ్‌కు వచ్చిన ఓ ఔత్సాహికుడు.. వైఫై పాస్‌వర్డ్‌ కనుగొనేందుకు కుస్తీ పట్టి విఫలమై.. ఫ్రెండ్స్‌ హెల్ప్‌ మీ అని రెడిట్‌ లో పోస్ట్‌ చేశాడంట. దాంతో ఈ కేఫ్‌కు చెప్పలేనంత క్రేజ్‌ వచ్చిందంట.

ప్రస్తుతం ఇలాంటి తికమక మకతిక పాస్‌వర్డ్‌ల రోజులు నడుస్తున్నాయి. గత ఏడాది శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన పాబ్లో రోచాట్ అనే డిజిటల్ ఆర్టిస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టర్ వీడియోను పోస్ట్ చేసారు. దానిపై, ‘ఉచిత వైఫై’ అనేది పెద్ద అక్షరాలతో హెడ్డింగ్‌గా వ్రాశారు. అయితే, పాస్‌వర్డ్ వందలాది యాదృచ్ఛిక అక్షరాలను కలిగి ఉండటంతో.. దాన్ని వాడుకోవాలంటే గోడ పొడువుగా రాయాల్సి వచ్చింది. అలాగే, ఇటీవల చైనీస్ విశ్వవిద్యాలయం ఉచిత వైఫై పాస్‌వర్డ్ పొందడానికి కాలిక్యులస్ సమీకరణాన్ని పరిష్కరించమని విద్యార్థులను కోరింది.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఎర్ర బెండకాయలండీ.. ఎంతో కాస్లీ.. ఎంతో హెల్దీ

మాజీ గవర్నర్‌పై రాజద్రోహం కేసు

రక్తపోటు పెరుగుతోందా? ఈ ఆహారాలు తీసుకోండి..!

ట్రిబ్యునల్స్‌ ఖాళీలు భర్తీ చేయకపోవడంపై ‘సుప్రీం’ ఆగ్రహం

బ్రిటన్‌ ఎంపీలకు కొత్త డ్రెస్‌ కోడ్‌

తేజ్‌ ప్రతాప్‌ ‘స్టూడెంట్‌ జన్‌శక్తి పరిషత్‌’ ప్రారంభం

తాలిబాన్‌ క్రూరం.. మాజీ మహిళా పోలీసు అధికారి దారుణహత్య

లాహోర్‌ను ముట్టడించిన భారత సేనలు

107 భాషలు ఈ జిల్లాలో మాట్లాడతారు.. ఏ జిల్లానో తెలుసా..?

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement