హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా జూన్ 2 న తెలంగాణ ఆవిర్భవ దినోత్సవాలను ఎన్నారైలు ఘనంగా జరుపుకోవాలని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు.
నీళ్లు, నిధులు, నియమాకాల నినాదంతో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ప్రగతి పతంలో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. బంగారు తెలంగాణ తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు.