Womens Day | వర్జీనియాలో ఘనంగా ఆటా మహిళా దినోత్సవం
Womens Day | అమెరికా తెలుగు సంఘం (ఆటా) 11వ మహిళా దినోత్సవాలు వర్జీనియా(Virginia )లో ఘనంగా జరిగాయి.
హైదరాబాద్ : అమెరికా తెలుగు సంఘం (ఆటా) 11వ మహిళా దినోత్సవాలు వర్జీనియా(Virginia )లో ఘనంగా జరిగాయి. ఈనెల 1 న చిన్మయ సోమ్నాథ్, చాంటిలి నగరంలో జరిగిన వేడుకలకు ఆటా(Aata) అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఉపాధ్యక్షులు జయంత్ చల్లా , పూర్వ అధ్యక్షులు భువనేష్ బుజాల , ట్రస్ట్ బోర్ద్ సభ్యులు సుధీర్ బండారు జ్యోతివెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 11వ వార్షికోత్సవం ఎంబ్రాస్ ఈక్వాల్టీ (EmbraceEquity) థీం తో మహిళా(Women’s day) దినోత్సవాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వాషింగ్టన్(Washington) ఏరియాలోని వివిధ రంగాలలో ప్రతిభ కనబరచిన మహిళ నాయకులు అట్ లర్జ్ ఫర్ ఫేర్ఫాక్స్ కౌంటి స్కూల్ బోర్డ్ చైర్ మెంబర్ రచ్న సిజెమొరె హైజెర్, ఫర్ ఎనైస్ సొల్యూషన్స్ కార్పొరేషన్ అధినేత్రి మగ్దలెన్ జన్సన్ ఓబాజి, తారు టెక్నోలోజిస్ అధినేత్రి అనుపమ కటికనేనిని సత్కరించారు. వివిధ రంగాల్లో ప్రతిభను, అనుభవాలతో పాటు మహిళా సాధికారత, మహిళా ఆరోగ్యం, మహిళా అభ్యున్నతి, ఆర్థిక స్వాతంత్య్రం అంశాలపై చర్చలు నిర్వహించారు.

అనంతరం నిర్వహించిన ఫ్యాషన్ షో(Fashion show), నృత్య కార్యక్రమాలు, క్విజ్(Quiz) పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దీపికా బుజాల (యూత్ స్కాలర్షిప్స్ కమిటి మెంబర్), నందినిరెడ్డి ఏడుల్ల(హెల్త్ కమిటీ మెంబర్), అనిత ముత్తోజు(వివాహా కమిటీ-చైర్), గాయత్రి చొక్కవరపు(ఆధ్యాత్మికం కమిటీ చైర్), షీతల్ బొబ్బ (సోషల్ మీడియా కమిటీ – చైర్), ప్రశాంతి ముత్యాల(రిజనల్ కో-చైర్), అనూష గంజి (యూత్ కమిటీ మెంబర్-రీజియన్), రవల్లిక బానోత్, ప్రత్యూష నరపరాజు, రోహిణి చల్ల (బిజినెస్ కమిటీ మెంబర్) కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ట్రస్ట్ బోర్డు సభ్యులు సుధీర్ బండారు దిగ్విజయం కావడానికి సహకరించిన వివిధ దాతలకు, స్పాన్సర్స్ (వైర జువెల్స్, దేశి 360, పరిణయ ట్రెండ్స్, సోమిరెడ్డి లా గ్రూప్, కాకతీయ కిచెన్, కంట్రి ఓవెన్,హల్లో 2 ఇండియా గ్రాసరి, దేసి చౌరస్తా, ఆర్క్, స్కై సొల్యూషన్స్, లేబెల్ బై వీన, అదవంతజె ఈట్ ఇంక్ అండ్ కిరాక్ ఎంటర్టేన్మెంట్ ) కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా కావడానికి సహకరించిన ఉపాధ్యక్షులు జయంత్ చల్లా, పూర్వ అధ్యక్షులు భువనేష్ బుజాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ట్రస్ట్ బోర్ద్ సభ్యులు సుధీర్ బండారు, రీజనల్ డైరెక్టర్ కౌశిక్ సామ, రీజనల్ అడ్వయిజర్ సుధీర్ దామిడి, రవి చల్లా(కార్పోరేట్ స్పానర్స్షిప్ చైర్), రీజనల్ కో-ఆర్డినేటర్ హనిమి వేమిరెడ్డి, అమర్ పాశ్య, హర్ష భరెంకబై, లోహిత్ రెడ్డి, మల్ల కాల్వ, రాము ముండ్రాతి (మీడియా కమిటీ చైర్) పాల్గొన్నారు. వీరితో పాటు అమర్ బొజ్జ, వెంకట్ వూట్కురి (స్పోర్ట్స్-రీజనల్ చైర్), అనిల్ బొయినపల్లి (బిజినెస్ కమిటీ మెంబర్), రాణా చెగు (బిజినెస్ కమిటీ అడ్వయిజర్), కిరణ్ పదెర( కమ్యూనిటీ సర్వీసెస్-రీజనల్ చైర్), పవన్ గోవర్ధన(మెంబర్ బెంఫిట్స్), అనిల్ కాశినేని(మెంబర్ రిసోర్సెస్-చైర్), నవీన్ రంగ(ఎడ్యుకేషన్ -మెంబర్), ప్రవీణ్ దాసరి (పబ్లిసిటీ-చైర్), శ్రీధర్ సన (స్పోర్ట్స్-చైర్), సంజయ్ నాయుడు (వెబ్&టెక్నొలజీ-కో-చైర్) హాజరయి వేడుకలను విజయవంతం చేశారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

