US Modern Immigration | భారతీయ ఐటీ నిపుణులు, టెక్ విద్యార్థులకు శుభవార్త. ప్రస్తుతం అమలులో ఉన్న ఇమ్మిగ్రేషన్ చట్టాలను సవరించేందుకు అమెరికా సన్నద్ధం అవుతున్నది. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలు, డిమాండ్‌కు సరిపడా దేశీయంగా డిగ్రీ నిపుణులను సిద్ధం చేయలేకపోతున్నది. న్యూ బిజినెస్ డెవలప్మెంట్, ఆర్థిక వృద్ధిలో భాగస్వాములను చేయడానికి అత్యంత నిపుణులైన వలస కార్మికులకు అవకాశాలు కల్పించడమే బెస్ట్ సొల్యూషన్ అని అమెరికా తలపోస్తున్నది. తద్వారా నిపుణుల కొరతను అధిగమించవచ్చునని భావిస్తున్నది. ఇమ్మిగ్రేషన్ చట్టాల ఆధునీకరణ ద్వారా బెస్ట్ ఇన్నోవేటర్లకు స్వాగతం పలకడం.. స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులకు డెడికేటెడ్ వీసా రూపొందించడం తదితర చర్యలు చేపట్టపోతున్నది.
దేశంలో అత్యంత నిపుణులైన కార్మికుల కొరతను నివారించడానికి అమెరికా చర్యలు తీసుకోకుంటే వచ్చే దశాబ్ద కాలంలో 90 లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఏర్పడతాయని, 1.2 లక్షల కోట్ల డాలర్ల మేరకు నష్టం వాటిల్లుతుందని టెక్‌నెట్ అనే వెబ్‌సైట్‌ను ఉటంకిస్తూ ఎకనమిక్ టైమ్స్ ఓ వార్తా కథనం ప్రచురించింది. టెక్ నెట్ అంటే టెక్నాలజీ సీఈవోల నెట్వర్క్.
అమెరికా ఆర్థిక వృద్ధిపై సానుకూల ప్రభావం చూపుతున్న ఇమ్మిగ్రేషన్ విధానంలో ప్రస్తుతం అమలు చేస్తున్న హెచ్-1బీ వీసా మార్గదర్శకాలను 14 ఏండ్లుగా మార్చలేదు. టెక్‌నెట్ సీఈవో కం ప్రెసిడెంట్ లిండా మోర్ మాట్లాడుతూ.. టాలెంట్‌లో మేం ఇప్పుడు గ్లోబల్ రేస్‌లో ఉన్నాం. ప్రపంచంలోకెల్లా ఉత్తమ ప్రతిభావంతులు, వారి కుటుంబాలను తప్పనిసరిగా అమెరికా ఆహ్వానిస్తుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ కోసం వారు తమ ప్రతిభను ఉపయోగించొచ్చునని అన్నారు.
తాజా డేటా ప్రకారం కోటికి పైగా ఉద్యోగ నియామకాలు సాగుతున్నాయి. 70 లక్షల మందికి పైగా అమెరికన్లు నిరుద్యోగులుగా ఉన్నారు. చిన్న కంపెనీల్లో పని చేసే సామర్థ్యం గల వర్కర్ల కోసం అన్వేషణ చేపట్టడం ఆయా కంపెనీల పురోగతిపై ప్రభావం పడుతున్నది. టెక్ నెట్ నివేదిక ప్రకారం 64 శాతం సంస్థలను నిపుణుల కొరత వెంటాడుతున్నది. ఫలితంగా ప్రొడక్టివిటీ 51 శాతానికి పడిపోవడంతో 42 శాతం ఆర్థిక వృద్ధి రేటు పతనమైంది. ఇన్నోవేషన్ 42 శాతం తగ్గుముఖం పట్టింది.
నిపుణులైన వలస కార్మికుల రాకతో అమెరికా వర్కర్ల ఉద్యోగాలపై ఎటువంటి ప్రభావం పడదని టెక్ నెట్ నివేదిస్తున్నది. నైపుణ్య వలస కార్మికుల రాకతో ఉద్యోగాల కల్పన పురోభివృద్ధితోపాటు అమెరికా సంస్థలు లాభాలను పెంచుకునేందుకు అవకాశం ఉందని చెబుతున్నది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఉత్తమ, ప్రతిభావంతులైన ఇన్నోవేటర్లకు అమెరికా కేంద్రంగా ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. కాలం చెల్లిన ఇమ్మిగ్రేషన్ విధానాలతో టెక్నాలజీ రంగ నిపుణులు కెనడా వంటి దేశాలకు తరలిపోతున్నారని ఆవేదన వ్యక్తం అవుతున్నది.
ఈ పరిస్థితుల్లో కంపెనీల అవసరాలకు అనుగుణంగా హై స్కిల్డ్ వర్కర్లను అమెరికాకు ఆహ్వానించాల్సిన అవసరం ఉందని, అందుకు చట్టంలో మార్పులు తేవాలని అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు, హౌస్ ఇమ్మిగ్రేషన్ అండ్ సిటిజన్‌షిప్ చైర్ జో లాఫ్గ్రెన్ అభిప్రాయ పడ్డారు. ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఆధునీకరించాలని, స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులకు డెడికేటెడ్ వీసా సృష్టించాలని పేర్కొన్నారు. తద్వారా భవిష్యత్ తరం పారిశ్రామికవేత్తలకు అమెరికా టాప్ దేశంగా రూపుదిద్దడంతోపాటు అమెరికన్లకు ఉద్యోగాల కల్పన, ఆర్థిక వృద్ధిరేటును వేగవంతం చేయగలమన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Gudipadu | తెలంగాణలోని ఈ గుడిలో గిరిజనులే పూజారులు
పెండ్లిళ్లు, శుభకార్యాల సమయంలో కంకణం ఎందుకు కడతారు?
ధర్మ సందేహం… పిండం కాకి తినకపోతే ఏమౌతుంది?
ఆది శంకరాచార్యులు సన్యాసం స్వీకరించేందుకు తల్లిని ఎలా ఒప్పించాడో తెలుసా?