హైదరాబాద్ : వంశీ ఇంటర్నేషనల్, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల మృతి చెందిన ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్(Chandramohan)కు అంతర్జాల మాధ్యమంగా(internet platform) సంస్మరణ సభ నిర్వహించి ఘన నివాళులు(Tribute) అర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ గేయ రచయిత భువనచంద్ర మాట్లాడుతూ.. తాను రాసిన మొట్టమొదటి గీతం చంద్రమోహన్ సినిమాకే రచించానని తెలియజేశారు.
నిర్వాహకులు డాక్టర్ వంశీ రామరాజు, కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల క్రితం వంశీ ప్రచురణగా చంద్రమోహన్ నటనా వైదుష్యాన్ని తెలియజేస్తూ 120 సినిమా సమీక్ష వ్యాసాలతో ప్రచురింపబడిన ‘సినితెర చంద్రమోహనం’ పుస్తకాన్ని తీసుకొచ్చామన్నారు. అందులో చంద్రమోహన్ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే పలు విషయాలు ఉన్నట్లు వారు తెలిపారు.
చంద్రమోహన్ మేనల్లుడు శివలెంక కృష్ణ ప్రసాద్ కాశీనాధుని నాగేంద్ర, రాధిక మంగిపూడి, శారద ఆకునూరి, హాస్యబ్రహ్మ శంకర నారాయణ, ప్రముఖ రచయిత్రి కేవీ కృష్ణకుమారి, ఆంధ్ర కళావేదిక ఖతార్ అధ్యక్షుడు వెంకప్ప భాగవతుల, కువైట్ నుంచి తెలుగు సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు సుధాకర్ కుదరవల్లి, సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య నుంచి మల్లేష్, అనిల్ కడించర్ల, ఉమామహేశ్వరరావు, మలేషియా నుంచి సత్య దేవి మల్లుల తదితరులు పాల్గొన్నారు. కల్చర్ టీవీ వారి సాంకేతిక సహకారంతో ఈ కార్యక్రమం యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారని కింది లింక్ ద్వారా చూడొచ్చని నిర్వాహకులు తెలిపారు. https://www.youtube.com/live/QsWbMLZB70s?si=4IpBa54CFXURz-cC
N2