Bathukamma | తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డలాస్ తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాలు, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. అల్లెన ఈవెంట్ సెంటర్లో వేడుకలు నిర్వహించారు. పదివేల మందికి సరిపోయే ఈ ఇండోర్ స్టేడియానికి వేలాది మంది బతుకమ్మలతో చేరుకోగా.. చివరకు నిర్వాహకులు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. చివరకు మరో ఐదువేల మందికిపైగా బయటే ఉండిపోగా.. వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు అందాలనటి ప్రియాంక మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సాయంత్రం మహిషాసుర మర్ధిని కార్యక్రమంతో పాటు అలయ్‌బలయ్ వేడుకు జరిపారు. కార్యక్రమానికి హాజరైన భోజనాలు ఏర్పాటు చేశారు. చివరగా తెలుగు సినీ నేపథ్య గాయకుడు రామ్ మిరియాల.. రెండున్నర గంటలపాటు లైవ్కన్సర్ట్తో అందరినీ ఉర్రూతలూగించారు. పాటపాటకూ అడుగులేస్తూ చివరికి అలసిపోయినా హుషారు నిండిన ఆనందంతో అందరూ ఇళ్లకు వెళ్లారు. ఫౌండేషన్ కమిటీ చెయిర్ జానకీరాం మందాడి, ప్రెసిడెంట్ రూపా కన్నయ్య, బీవోటీ చెయిర్ బుచ్చిరెడ్డి గోలి, కోఆర్డినేటర్ రవికాంత మామిడి నేతృత్వంలో జరగ్గా.. టీపాడ్ సభ్యులు సహకారం అందించారు.
వేడుకలకు హాజరైన నటి ప్రియాంక, రామ్ మిరియాల సైతం బతుకమ్మ వేడుకలు ఇంత గొప్పగా నిర్వహిస్తారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన జీవితంలో ఇంత పెద్ద పండుగ ఈవెంట్‌ని చూడలేదని.. ఇది తనకు దక్కిన అదృష్టమన్నారు. అమెరికా గడ్డపై వేలాది మంది తెలుగువారి మధ్య పాటలు పాడడం మరిచిపోలేమని, టీపాడ్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని రామ్ మిరియాల బృందం సంతోషం వ్యక్తం చేసింది.
Nri Tpad