హైదరాబాద్ : ఎన్నారై(NRI) బీఆర్ఎస్ యూకే విభాగం 15 వ వార్షికోత్సవం సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి బృందం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా కేటీఆర్ కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. విదేశాల్లో ఉంటూ పార్టీకి ఎల్లపుడూ అండగా ఉంటూ అద్భుతంగా పని చేస్తున్నారని ప్రశంసించారు.
ఉద్యమ సమయం నుండి లండన్ వేదికగా ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం చేసిన పోరాటం ఎప్పటికీ మరవలేమని కేసీఆర్ అన్నారు. అన్ని సందర్భాల్లో పార్టీ గొంతుకై ఖండాంతరాల్లో నిర్విరామంగా పని చేస్తున్నారని, అదే స్ఫూర్తిని కొనసాగించాలని కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. మళ్లీ వచ్చేది మన బీఆర్ఎస్ ప్రభుత్వమేనని వారికి భరోసా ఇచ్చారు. అలాగే ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం 15 వ వార్షికోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.
కేసీఆర్, కేటీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ రానున్న రోజుల్లో సైతం అదే స్ఫూర్తితో పని చేస్తామని, ప్రజలకు అండగా ఉంటామని నవీన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల, అడ్వైజరీ బోర్డు చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్, ఉపాధ్యక్షుడు సతీష్ రెడ్డి గొట్టెముక్కల, కార్యదర్శి రవి ప్రదీప్ పులుసు తదితరులు పాల్గొన్నారు.

Kt