Telangana Secretariat | నూతన సచివాలయం దేశానికే గర్వకారణం : బీఆర్ఎస్ కువైట్ శాఖ
Telangana Secretariat | భారతదేశం గర్వించదగ్గ రీతిలో తెలంగాణ నూతన సచివాలయాన్ని(New Secretariat Building) అన్ని హంగులతో నిర్మించడం అభినందనీయమని బీఆర్ఎస్ కువైట్(BRS Kuwait) శాఖ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల పేర్కొన్నారు.
హైదరాబాద్ : భారతదేశం గర్వించదగ్గ రీతిలో తెలంగాణ నూతన సచివాలయాన్ని(New Secretariat Building) అన్ని హంగులతో నిర్మించడం అభినందనీయమని బీఆర్ఎస్ కువైట్(BRS Kuwait) శాఖ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల పేర్కొన్నారు. నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్(BR Ambedkar) నామకరణం చేయడం పట్ల సీఎం కేసీఆర్(CM KCR )కు అభినందనలు తెలిపారు.
ఈ సచివాలయం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. తెలంగాణను సగర్వంగా నిలబెట్టాలనే లక్ష్యంతో పలు కట్టడాలను నిర్మించారని వెల్లడించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని , అమరుల త్యాగాలను స్మరిస్తూ స్మారక స్థూపం, యాదాద్రి(Yadadri temple)లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పునర్నిర్మాణం చేశారని వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) , మిషన్ భగీరథ , దుర్గం చెరువు కేబుల్ వంతెనను నిర్మించారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ విజన్, పట్టుదల, అకుంఠిత దీక్షకు ఈ నిర్మాణాలు ఒక సాక్ష్యమని వెల్లడించారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

