మునుగోడులో టీఆర్ఎస్ను గెలిపించండి.. కాలిఫోర్నియా కమిషనర్ రఘు రెడ్డి పిలుపు
Raghu Reddy | మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డినే గెలిపించాలని.. సూర్యాపేటలో జన్మించి, అమెరికాలోని కాలిఫోర్నియా నగర కమిషనర్ అయిన భారత సంతతి వ్యక్తి
కాలిఫోర్నియా: మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డినే గెలిపించాలని.. సూర్యాపేటలో జన్మించి, అమెరికాలోని కాలిఫోర్నియా నగర కమిషనర్ అయిన భారత సంతతి వ్యక్తి రఘు రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలతో పోల్చిచూస్తే అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రమే మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిపట్ల నిబద్ధతతో ఉన్నదని, కాబట్టి స్థానిక ఓటర్లు టీఆర్ఎస్కు మద్దతుగా నిలువడం తెలివైన నిర్ణయమని ఆయన సూచించారు.
టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మునుగోడు అభివృద్ధి బాధ్యతను మంత్రి కేటీఆర్ తీసుకుంటారని.. కాబట్టి కేటీఆర్, జిల్లా ఇన్చార్జి మంత్రి జగదీశ్‌రెడ్డిల చేతులకు మరింత బలం చేకూర్చేలా అధికార పార్టీ అభ్యర్థికి ఓటేయాలని రఘు రెడ్డి కోరారు. కాలిఫోర్నియా నగరానికి తొలి భారత సంతతి కమిషనర్‌గా మంత్రులు కేటీఆర్‌ను, జగదీశ్‌రెడ్డిని తాను కలిశానని, వారు ఎంత నిబద్ధత, అంకితభావం, చలనశీలత కలిగిన వ్యక్తులో గమనించానని చెప్పారు.
కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు అవకాశం ఇవ్వాలని, మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డిల ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుంతో చూడాలని రఘు రెడ్డి అక్కడి ఓటర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

