దక్షిణాఫ్రికాలోని మనవాళ్లంతా క్షేమం : గుర్రాల నాగరాజు

జోహన్స్‌బర్గ్ : దక్షిణాఫ్రికాలోని తెలుగువారంతా క్షేమంగా ఉన్నట్లు టీఆర్ఎస్ ఎన్నారై శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు తెలిపారు. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా జైలుకు వెళ్లడంతో మొదలైన ఆందోళనలు తీవ్రరూపం దాల్చి అల్లర్లు, దోపిడీలకు దారితీశాయి. ప్రజలు, నిరసనకారులు ఆహారం, వస్త్ర దుకాణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, మద్యం, షాపింగ్ మాల్స్‌పై దాడి చేసి లూటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యంగా ముఖ్యంగా గౌటెంగ్, క్వాజులు-నాటల్ ప్రావిన్సుల్లో చోటుచేసుకున్న ఘర్షణలు, హింసాత్మక ఘటనలు, తొక్కిసలాటలో సుమారు 200 మంది చనిపోయారు. ప్రవాసుల క్షేమంపై ఆందోళనలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో గుర్రాల నాగరాజు అక్కడి పరిస్థితిని తెలియజేశారు.
అధ్యక్షుడి నిన్నటి ప్రసంగం తర్వాత పరిస్థితులు సద్దుమనుగుతాయి అనుకున్నాం. కానీ డర్బన్‌లో హింసాత్మక సంఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మిలటరీ రంగంలోకి దిగినా చాలా చోట్ల చెదురుమొదురు సంఘటనలు జరుగుతున్నాయన్నారు. తెలుగు వారంతా ఎక్కువగా జోహన్స్‌బర్గ్‌లో ఉంటారని వారంతా క్షేమంగానే ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఎలాంటి ఇబ్బంది లేదని రాబోయే రెండు మూడు రోజుల్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

