లండన్ : టాక్, బీఆర్ఎస్(BRS) ఎన్నారై యూకే ఆధ్వర్యంలో లండన్లో (London) తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు (Formation Celebrations) ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం అమరవీరులను స్మరించుకుంటు మౌనం పాటించారు. రత్నాకర్ కడుదుల , నవీన్ రెడ్డి నాయకత్వంలో కేక్ కట్ చేసి రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్నారై సెల్ అధ్యక్షులు నవీన్ రెడ్డి (Naveen Reddy) , టాక్ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల ( Ratnakar Kadudula) , బీఆర్ఎస్ ఎన్నారై సెల్ ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాపేట్, సత్య మూర్తి చిలుముల, టాక్ అడ్వయిజరీ బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీకాంత్ జెల్ల , గణేష్ కుప్పాల, ఐటీ, మీడియా , పీఆర్ కార్యదర్శి రవి ప్రదీప్ పులుసు, కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్ రమేష్ ఇస్సంపల్లి, సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ రావు కటికనేని,టాక్ సంస్థ ఉపాధ్యక్షులు సురేష్ బుడగం, జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ జెల్ల, స్పాన్సర్ సెక్రటరీ నాగరాజు , అబ్దుల్ జాఫర్, ఇస్మాయిల్ అబ్బు , సుప్రజ పులుసు, స్వాతి బుడగం, క్రాంతి రేటినేని, శైలజ జెల్ల, శ్రీవిద్య ,స్నేహ, దివ్య, పావని తదితరులు పాల్గొన్నారు.