NRI news | డల్లాస్‌లో తెలంగాణ పీపుల్స్ అసోషియేషన్ బ్లడ్ డ్రైవ్.. ‘కమ్యూనిటీ ఛాంపియన్’ గా TPAD కి గుర్తింపు
NRI news | తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (TPAD) తాజాగా డల్లాస్‌లో తన 11వ బ్లడ్ డ్రైవ్ నిర్వహించింది. ప్రతిసారి బ్లడ్ డ్రైవ్‌తో కొత్త ఏడాదిని ప్రారంభించడం TPAD సంప్రదాయంగా వస్తున్నది. గత పదేండ్లుగా TPAD డల్లాస్‌లో బ్లడ్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నది.
డల్లాస్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (TPAD) తాజాగా డల్లాస్‌లో తన 11వ బ్లడ్ డ్రైవ్ నిర్వహించింది. ప్రతిసారి బ్లడ్ డ్రైవ్‌తో కొత్త ఏడాదిని ప్రారంభించడం TPAD సంప్రదాయంగా వస్తున్నది. గత పదేండ్లుగా TPAD డల్లాస్‌లో బ్లడ్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నది. అయితే కరోనాకు ముందు ఏటా ఒక్కసారి మాత్రమే బ్లడ్ డ్రైవ్ నిర్వహించే TPAD.. ఇప్పుడు ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తున్నది.
డల్లాస్‌లోని కార్టర్ బ్లడ్ కేర్ సెంటర్, రెడ్‌క్రాస్ ద్వారా TPAD అందించిన బ్లడ్‌ను వినియోగించి గత పదేళ్లలో దాదాపు 1000 మందికిపైగా ప్రాణాలు దక్కాయి. పదేళ్లలో 11 బ్లడ్ డ్రైవ్‌ల ద్వారా మొత్తం 1000 మందికిపైగా ప్రాణాలు కాపాడటంలో తోడ్పడినందుకు కార్టర్ బ్లడ్ కేర్ సెంటర్ TPAD కి ‘కమ్యూనిటీ ఛాంపియన్’ గా గుర్తింపునిచ్చింది.

Tpad Blood Drive
2014 నుంచి ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా స్థానిక ఐటీ కంపెనీ అయిన ‘ఐటి స్పిన్’ కార్యాలయ ప్రాంగణంలో బ్లడ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ 11 బ్లడ్ డ్రైవ్‌కు 61 మంది దాతలు రక్తదానం చేసేందుకు వచ్చారు. వారిలో 48 మంది మాత్రమే రక్తదానం చేసేందుకు అర్హులయ్యారు. వారి నుంచి కార్టర్ బ్లడ్ కేర్ సెంటర్ మొత్తం 50 పింట్ల రక్తాన్ని సేకరించింది.
ఒక పింట్ రక్తం ద్వారా ముగ్గురి ప్రాణాలను కాపాడవచ్చు. ఇప్పుడు TPAD ఇచ్చిన రక్తం 150 మంది ప్రాణాలను కాపాడేందుకు తోడ్పడుతుంది. తొమ్మది గుండె ఆపరేషన్లకు, 16 రక్తమార్పిడిలకు ఈ రక్తం సరిపోతుంది. ఈ బ్లడ్ డ్రైవ్‌ను కన్నయ్యగారి రూపా, లింగంపల్లి నరేష్ సమన్వయం చేశారు. బండారు రఘువీర్ రెడ్డి (FC చైర్), అల్వా లింగారెడ్డి (అధ్యక్షుడు), కలసాని సుధాకర్ (BOT చైర్), ఆదెపు రోజా (కో ఆర్డినేటర్) ఈ బ్లడ్ డ్రైవ్‌కు మార్గదర్శనం చేశారు. అదేవిధంగా TPAD టీమ్ అంతా ఈ డ్రైవ్‌కు సహకారం అందించింది.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

