హైదరాబాద్ / లండన్ : యూకే(UK ) లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలు, ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్( BRS ) లో చేరారు. ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ( Anil Kurma Chalam )వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
కేసీఆర్ ( KCR ) , కేటీఆర్ ( KTR ) నాయకత్వంలో పనిచేయాలనే సంకల్పంతో పార్టీలో చేరుతున్నామని, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీ రామ రక్షా అని బీఆర్ఎస్లో చేరిన ఎన్నారైలు పేర్కొన్నారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు హరి బాబు నవపేట్ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో మాజీ అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రానున్న రోజుల్లో అటు సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా లండన్లో ప్రత్యేక నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్టు ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి తెలిపారు. అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా లండన్ లో పార్టీ చేస్తున్న కార్యక్రమాలని, ఎన్నారైలు పార్టీకి అండగా ఉంటూ చేస్తున్న సేవలను నూతన సభ్యులకు వివరించి వారికి దిశా నిర్దేశం చేశారు.

ఎన్నారై బీఆర్ఎస్ యూకే సలహామండలి చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ, ఉద్యమ సమయం నుంచి నేటి వరకు ప్రపంచంలో అందరికీ ఆదర్శంగా నిలిచామని, అదే స్ఫూర్తి, క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అంటే సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని, కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పని చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన పోరాటం చెయ్యాలని తీర్మానించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సత్యమూర్తి చిలుముల , ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల , కార్యదర్శి రవి ప్రదీప్ గౌడ్ పులుసు, కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్ రమేష్ ఎసెంపల్లి వందన , అడ్వయిజరీ బోర్డు చైర్మన్ సీక చంద్ర శేఖర్ గౌడ్, అడ్వయిజర్ బోర్డు వైస్ చైర్మన్ శ్రీకాంత్ జెల్ల, సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి, ఐటీ, మీడియా అండ్ పీఆర్ కార్యదర్శి రవి ప్రదీప్ పులుసు పాల్గొన్నారు.
వీరితో పాటు కార్యదర్శులు అబూ జాఫర్,సురేష్ గోపతి, కోశాధికారి సురేష్ బుడగం, లండన్ ఇన్చార్జి సత్యపాల్ రెడ్డి పింగలి, కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్ రమేష్ ఇస్సంపల్లి, సంయుక్త కార్యదర్శులు నవీన్ మాదిరెడ్డి, ప్రశాంత్ రావు కటికనేని, రామకృష్ణ కలకుంట్ల, యూత్ వింగ్ కార్యదర్శి ప్రశాంత్ మామిడాల, మెంబర్షిప్ కో ఆర్డినేటర్ అంజన్ రావు, యూత్ వింగ్ సెక్రటరీ పవన్ కుమార్ గౌడ్, ఈవెంట్స్ ఇన్చార్జి తరుణ్ లునావత్, తదితరులు పాల్గొన్నారు.