Bonalu Festival | తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల పండుగ టాంజానియాలో ఘనంగా నిర్వహించారు. దార్ ఎస్ సలాం నగరంలో తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోనాల వేడుకలను ఆదివారం జరిపారు. ప్వెజా బీచ్ రిసార్ట్ ఆవరణలో భక్తులు జరిగిన వేడుకల్లో మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, బోనాలు వండి నైవేద్యం సమర్పించారు. తెలంగాణకు ప్రవాసీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని.. మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందజేయడంలో తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ముందు వరుసలో ఉంటుందని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ టాంజానియా అధ్యక్షుడు వంగ నర్సింహా రెడ్డి అన్నారు. కార్యక్రమంలో టాంజానియా కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనిలై, పీ సత్యనారాయణ, సురేందర్ సెలం, సూర్య మోహన్ రెడ్డి, తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ సభ్యులు ప్రవీణ్ చంద్ర, శివ, మిథున్, రాజేశ్, మహేశ్ రెడ్డి, సురేష్, రాజు, రాజేందర్, ప్రభాకర్, విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కుశల్ రెడ్డి, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.