NRI | ఇండియా డే వేడుకల్లో ఆకట్టుకున్న ‘తెలంగాణ స్టాల్’
లండన్ లోని భారత హై కమిషన్, బారత దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలతో సంయుక్తంగా భారత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిపిన " ఇండియా డే వేడుకల్లో", తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) (TAUK), తెలంగాణా రాష్ట్రానికి ప్రాతినిత్యం వహించింది.
లండన్ : లండన్ లోని భారత హై కమిషన్, బారత దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలతో సంయుక్తంగా భారత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిపిన ” ఇండియా డే వేడుకల్లో”, తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) (TAUK), తెలంగాణా రాష్ట్రానికి ప్రాతినిత్యం వహించింది. భారత హై కమీషనర్ పెరియాసామి కుమారన్ ముందుగా జెండా ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన తో కార్యక్రమం ప్రారంభమయ్యింది. ముందుగా తెలంగాణ ప్రత్యేకతతో టాక్ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్ ని టాక్ అధ్యక్షడు రత్నాకర్ కడుదుల ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రాతినిధ్యం ఉట్టి పడేలా..
తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను, చరిత్రను, భాషా, సంస్కృతి, పర్యాటక ప్రత్యేకత, అభివృద్ధి..ఇలా వీటంన్నింటి సమాచారాన్ని స్టాల్ లో ప్రదర్శించి, హాజరైన వారందరికీ తెలంగాణ ప్రత్యేకత గురించి వివరించారు. స్టాల్ లో ఏర్పాటు చేసిన జాతీయ నాయకుల, తెలంగాణా ప్రముఖుల చిత్ర పాటాలకు నివ్వాలర్పించారు. తెలంగాణా రాష్ట్ర ప్రాముఖ్యత, విశిష్టత గురించి వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులకు, ఇతర ఆతిథులకు తెలియజేయాలనే భావన తో, టాక్ సంస్థ ఆద్వర్యం లో తెలంగాణా ప్రముఖులు, సాధించిన విజాయాల తో కూడిన ప్రత్యేక “తెలంగాణా స్టాల్ ” ని ఏర్పాటు చేయడం జరిగిందని సంస్థ ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు తెలిపారు. ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిత్యం వహిస్తూ కేవలం టాక్ సంస్థ మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో గర్వంగా ఉందని, వ్యక్తిగతంగా ఎంతో బిజీగా ఉన్నపటికీ వాటన్నిటీనీ పక్కన బెట్టి బాధ్యత గల సంస్థగా , తెలంగాణ బిడ్డలుగా ఇందులో భాగ్వములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, తెలంగాణ ప్రత్యేక స్టాల్ నిర్వాహణకు కృషి చేసి సహకరించిన కార్యవర్గ సభ్యులకు టాక్ ఈవెంట్స్ ఇంచార్జి మల్లా రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు.
స్టాల్ ను సందర్శించిన ప్రముఖులకు, ఇతర స్థానిక సంస్థల ప్రతినిధులకు టాక్ ఉపాధ్యక్షుడు సురేష్ బుడగం వారికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. తెలంగాణా సంస్కృతి – సాంప్రదాయాలు, తెలంగాణ విజయాలు, పర్యాటక ప్రత్యేకత, చాలా గొప్పగా ఉందని, నూతన రాష్ట్ర సంస్కృతిని, గొప్పతన్నాని, ప్రపంచానికి చూపెట్టాలనే ప్రయత్నం చాలా స్పూర్తి దాయకంగా ఉందని హాజరైన ప్రవాస భారతీయులు ప్రశంశించారు. “తెలంగాణా స్టాల్” ని సందర్శించిన ఆతిథులందరికి మన “హైధారాబాద్ బిర్యానీ” రుచిచూపించామని టాక్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ జెల్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో రాకేష్ పటేల్, పవిత్ర , నవీన్ రెడ్డి, సత్యపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, స్వాతి, సత్యం కంది, హరి గౌడ్, క్రాంతి రేతినేని, రవి పులుసు, శ్రీ లక్ష్మి, సందీప్, సాయి కిరణ్ కనుగుల, అబ్దుల్ ఖుద్దూస్, అద్విత్ కంది, పావని, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

