డల్లాస్ : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు డల్లాస్ సిద్ధమైంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) హాజరుకానున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు అధ్వర్యంలో ఆదివారం సౌత్ ఆఫ్రికాలో సన్నాహక సభ నిర్వహించారు. రజతోత్సవ వేడుకలకు సౌత్ ఆఫ్రికా బీఆర్ఎస్ ఎన్నారై శాఖ తరఫున సంఘీభావం తెలియజేశారు. అలాగే ప్రజలందరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ కార్యక్రమములో కమిటీ సభ్యులు పాల్గొని రాబోయే రోజుల్లో సౌత్ ఆఫ్రికాలో రజతోత్సవసభ ఏర్పాట్లపై తమ అభిప్రాయాలను తెలిపారు. డల్లాస్ సభ అనంతరం సౌతాఫ్రికాలో జరిగే ఏర్పాట్లపై పూర్తి వివరాలను అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రములో కమిటీ సభ్యులు నాగరాజు గుర్రాల, మేడసాని నరేందర్ రెడ్డి, హరీష్ రంగ, శీరిష కట్ట, జ్యోతి వాసిరెడ్డి, సౌజన్ రావు, అరవింద్ చేకోటి, కిరణ్ బెల్లి, వూరే వంశీ, వెంకట్ రావు తాళ్లపల్లి, రంజిత్, శ్రీధర్ రెడ్డి, శివ రెడ్డి, సాయి కిరణ్ వేముల, నవదీప్ రెడ్డి, విజయ్ జుంజురు,నామా రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.