NRI BRS UK | లండన్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ కు సిట్ నోటీసులు కేవలం రాజకీయ కుట్ర, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనన్నారు. మొన్న హరీష్ రావుకు, నేడు కేటీఆర్కు నోటీసులనీ కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో కొత్త డ్రామాకు తెరలేపుతుందని ఆరోపించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి తమ అక్రమాలను, కుంభకోణాలను బయటపెడ్తున్న ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఇలాంటి ఎన్ని కేసులు, ఎన్ని నోటీసులు పంపినా కేసీఆర్ సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవనీ, రెట్టింపు ఉత్సాహంతో మీ స్కాములను బయటపెడుతూనే వుంటామని నవీన్ రెడ్డి హెచ్చరించారు.
ఆరు గ్యారెంటీలు అమలు చేసేదాకా ప్రశ్నిస్తూనే వుంటామని ఆయన అన్నారు. పాలన చాతకాక ఇలాంటి కుట్ర రాజకీయాలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసి ఎన్నారైలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎన్నో త్యాగాలతో ఏర్పడిన తెలంగాణను అభివృద్ధి చేయకుండా.. తన వ్యక్తిగత కక్షలకు సమయాన్ని వృధా చేస్తున్నారని నవీన్ రెడ్డి మండిపడ్డారు.